Wife: నా భార్య బ్రహ్మరాక్షసి, మెంటల్ టార్చర్ పెట్టింది, 21 కేజీలు తగ్గిపోయాను, విడాకులు ఇచ్చిన హైకోర్టు!

హర్యానా/ పంజాబ్/ చెన్నై: వివాహం చేసుకున్నపటి నుంచి తన భార్య తన మీద పగబట్టిందని, తనను మానసికంగా హింసించి మెంటల్ టార్చర్ పెట్టి తనను చిత్రహింసలకు గురి చేస్తోందని భర్త కోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. బొద్దుగా లడ్డూ లాగా ఉండే నేను ఇప్పుడు ఎండ చేప అయిపోతున్నానని భర్త ఆరోపించాడు. తన భార్య ఇంట్లో వంటచేసే పెట్టేది ఆ దేవుడు ఏరుగు స్వామి, నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చెయ్యడంతో టార్చర్ తట్టుకోలేక నేను లోలోపల కుమిలిపోతున్నాను. తన మాంసం, రక్తం అవిరి అయిపోతా ఉందని భర్త లబోదిబో అన్నాడు. తన భార్య ఏ రైంజ్ లో తనన టార్చర్ చేసింది అనే ఉదాహరణ చెప్పిన భర్త జరిగిన స్టోరీ మొత్తం హైకోర్టులో చెప్పాడు. గత ఏడాది నేను 74 కేజీల బరువుతో గుండ్రాయిలా ఉన్నాను, ఇప్పుడు నేను 53 కేజీల బరువుతో ఎండు చేప అయిపోయానని హైకోర్టులో చెప్పాడు.

నా బరువు తగ్గిపోయి నేను మానసికంగా కుంగిపోవడానికి తన భార్య కారణం అని, ఇంకా నా భార్య నన్ను టార్చర్ చేస్తే మరింత బరువు తగ్గిపోయి నా ప్రాణం పోయే అవకాశం ఉందని భర్త ఆరోపించాడు. నేను 21 కేజీలు బరువు తగ్గిపోవడానికి తన భార్య పెట్టే చిత్రహింసలు కారణం అని, ఆమె నుంచి నాకు విడాకులు ఇప్పించాలని హైకోర్టులో మనవి చేశాడు. అయితే భర్త మీద భార్య చేసిన వరకట్నం వేధింపుల ఆరోపణలకు సాక్షాలు లేకపోవడంతో హైకోర్టు దంపతులకు విడాకులు ఇచ్చింది. భార్య నుంచి విడాకులు తీసుకున్న భర్త ఇప్పుడు హ్యాపీగా ఊపిరిపీల్చుకుంటున్నాడు. భార్య దెబ్బతో తాను 21 కేజీ బరువు తగ్గిపోయానని భర్త విడాకులకు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది.

 9 సంవత్సరాల క్రితం పెళ్లి

9 సంవత్సరాల క్రితం పెళ్లి

పంజాబ్ లోని హిసార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2012 సంవత్సరంలో కుటుంబ సభ్యులు చూసిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో రాజేష్ వివాహం అయ్యింది. రాజేష్ కు వినికిడి లోపం ఉంది. ఎవరైన మాట్లాడితే కేవలం 50 శాతం మాత్రమే అతనికి మాటాలు వినిపిస్తాయని సమాచారం.

 భార్య స్కూల్ టీచర్

భార్య స్కూల్ టీచర్

రాజేష్ ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. రేఖా హిసార్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. కుమార్తె పుట్టిన తరువాత రాజేష్, రేఖా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నువ్వు చెవుటివాడవని, నేను మోసపోయి నిన్ను వివాహం చేసుకున్నాని భార్య రేఖా ఆమె భర్త రాజేష్ ను అందరి ముందు చులకనగా మాట్లాడటం మొదలు పెట్టిందని సమాచారం.

 లడ్డూ లాగా ఉండే నేను ఎండు చేప అయిపోయాను

లడ్డూ లాగా ఉండే నేను ఎండు చేప అయిపోయాను

వివాహం చేసుకున్నపటి నుంచి తన భార్య రేఖా తన మీద పగబట్టిందని, తనను మానసికంగా హింసించి తనను చిత్రహింసలకు గురి చేస్తోందని ఆమె భర్త రాజేష్ కోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. బొద్దుగా లడ్డూ లాగా ఉండే నేను ఇప్పుడు ఎండ చేప అయిపోతున్నానని, దానికి నా భార్య రేఖా కారణం అంటూ ఆమె భర్త రాజేష్ ఆరోపిస్తున్నాడు.

కాపురం చేసే టైమ్ లో వంటలు కాదు టార్చర్ చేసింది

కాపురం చేసే టైమ్ లో వంటలు కాదు టార్చర్ చేసింది

తన భార్య రేఖా ఇంట్లో వంటచేసే పెట్టేది ఆ దేవుడు ఏరుగు స్వామి, నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చెయ్యడంతో టార్చర్ తట్టుకోలేక నేను లోలోపల కుమిలిపోతున్నానని రాజేష్ ఆరోపించాడు. తన మాంసం, రక్తం అవిరి అయిపోతావున్నాయని భర్త రాజేష్ లబోదిబో అంటున్నాడు. తన భార్య రేఖా ఏ రైంజ్ లో తనన టార్చర్ చేసింది అనే ఉదాహరణ చెప్పిన భర్త రాజేష్ జరిగిన స్టోరీ మొత్తం ఫ్యామిలీ కోర్టులో పూసగుచ్చినట్లు చెప్పాడు.

74 నుంచి 53 కేజీలకు వచ్చాను... ఇంకా ఉంటే?

74 నుంచి 53 కేజీలకు వచ్చాను... ఇంకా ఉంటే?

గత ఏడాది నేను 74 కేజీల బరువుతో గుండ్రాయిలా ఉన్నాను, ఇప్పుడు నేను 53 కేజీల బరువుతో ఎండు చేప అయిపోయానని, దీనికి మొత్తం కారణం తన భార్య రేఖా అంటూ ఆమె భర్త రాజేష్ కోర్టులో చెప్పాడు. నా బరువు తగ్గిపోయి నేను మానసికంగా కుంగిపోవడానికి తన భార్య రేఖా కారణం అని, ఇంకా నా భార్య నన్ను టార్చర్ చేస్తే మరింత బరువు తగ్గిపోయి నా ప్రాణం పోయే అవకాశం ఉందని భర్త రాజేష్ ఫ్యామిలీ కోర్టులో ఆరోపించాడు.

వరకట్నం ఆరోపణలు చేసిన భార్య

వరకట్నం ఆరోపణలు చేసిన భార్య

నేను 21 కేజీలు బరువు తగ్గిపోవడానికి తన భార్య రేఖా పెట్టే చిత్రహింసలు కారణం అని, ఆమె నుంచి నాకు విడాకులు ఇప్పించాలని ఆమె భర్త రాజేష్ కోర్టులో మనవి చేశాడు. అయితే వివాహం జరిగినప్పటి నుంచి తనను అదనపు కట్నం కావాలని హింసిస్తున్నారని రేఖా ఆమె భర్త రాజేష్, అతని కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసింది.

Recommended Video

    Shikhar Dhawan సింగిల్.. ఇంతకీ ఎవరీ Ayesha Mukherjee | గబ్బర్ కంటే పదేళ్లు పెద్ద || Oneindia Telugu
    విడాకులు మంజారు చేసిన హైకోర్టు

    విడాకులు మంజారు చేసిన హైకోర్టు

    పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అర్చన పురి ధర్మాసం దంపతుల వాదనలు విన్నారు. 2016 నుంచి భార్య ఆమె భర్త, కూతురుకు దూరంగా ఉంటున్నారని, అలాంటప్పుడు వరకట్నం వేధింపులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. భార్య చేస్తున్న ఆరోపణలో నిజం లేదని గుర్తించిన కోర్టు భర్తకు విడాకులు ఇచ్చేసింది. భార్య టార్చర్ తట్టుకోలేక బరువు తగ్గిపోయిందని కేసు వేసిన భర్త ఇప్పుడు తన భార్యను స్వేచ్చ వచ్చిందని, ఈ రోజే తనకు నిజమైన పండుగ అని అంటున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+