• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ‌,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!

|

అమెరికా/హైద‌రాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగ‌వాడిగా నటించిన ఆ భర్తకు 'ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంతకీ.. ఆ నిజం ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ఇది చ‌ద‌వాల్సిందే..!'F2' సినిమాలో వెంకటేష్ చెప్పినట్లు.. భార్యల పోరు పడలేని భర్తలు 'అంతేగా అంతేగా' అంటే ఎలాంటి గొడవ ఉండదు. ఇదే తరహాలో ఓ భర్త భలే గొప్ప ప్లాన్ వేశాడు. తన భార్య మాటలను వినకుండా తప్పించుకునేందుకు బధిరుడు(మూగ, చెవుడు)గా నటిస్తూ చీకూ చింత లేకుండా సంసారం సాగించాడు. ఆమెకు కొంచెం కూడా అనుమానం రాకుండా 62 ఏళ్లు తన నాటకాన్ని కొనసాగించాడు. కానీ, చిన్న పొరపాటుతో భార్యకు దొరికిపోయాడు. ఫలితంగా ఆమె విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది.

ఇదీ అస‌లు న‌ట‌న అంటే..! ఏం అవార్టు ఇవ్వాలో చెప్పండి..!!

ఇదీ అస‌లు న‌ట‌న అంటే..! ఏం అవార్టు ఇవ్వాలో చెప్పండి..!!

అమెరికాలోని వాటర్‌బ్యూరీకి చెందిన ఎన‌భై నాలుగు ఏళ్ల బ్యారీ డాసన్.. కొన్ని దశాబ్దాలుగా త‌న ఎన‌భై ఏళ్ల భార్య డోరతీ తో ఒక ముక్క కూడా మాట్లాడకుండా.. ‘సైలెంట్'గా సంసారం సాగించాడు. అతను నిజంగానే బధిరుడని భావించి ఆమె ప్రత్యేకంగా సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞలు) కూడా నేర్చుకుంది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో వారి సంసారం ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోయింది. ఫలితంగా వారికి ఆరుగురు పిల్లలు పుట్టారు. 13 మంది మనవళ్లు కూడా ఉన్నారు. డాసన్ కుటుంబ సభ్యులు కూడా ఆయన మూగవాడనే భావించారు.

 బాపురే..ఒక‌టికాదు, రెండు కాదు..! 62 ఏళ్ల న‌ట‌న‌..! ర‌క్తి క‌ట్టిన‌ట్టేనా..!!

బాపురే..ఒక‌టికాదు, రెండు కాదు..! 62 ఏళ్ల న‌ట‌న‌..! ర‌క్తి క‌ట్టిన‌ట్టేనా..!!

అతను ఎంత అద్భుతంగా నటించినా.. నిజం ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా! ఆ రోజు రానే వచ్చింది. ఇటీవల డాసన్ ఓ బారులో జరిగిన వేడుకలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం యూట్యూబ్ లైవ్‌లో ప్రసారమైంది. అనుకోకుండా డోరతి ఆ వీడియో చూసింది. చారిటీ మిటింగ్ ఉందని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమెకు తేరుకోలేని షాక్ తగిలింది. ఆ బార్‌లో డాసన్ హుషారుగా గెంతులేస్తూ పాటలు పాడటం చూసి బామ్మగారికి మతిపోయింది. డాసన్‌కు మాటలు వచ్చినా తన వద్ద మూగ, చెవిటివాడిగా నటించాడని తెలిసి బాధపడింది. 62 ఏళ్లుగా డాసన్ తనతో మాట్లాడకుండా మోసం చేశాడని, ఇక అతనితో కలిసి ఉండలేనంటూ ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది.

 జీవిత‌మే న‌ట‌న‌..! సంసార‌మే నాట‌క‌రంగం అయిపోయిందిగా..!!

జీవిత‌మే న‌ట‌న‌..! సంసార‌మే నాట‌క‌రంగం అయిపోయిందిగా..!!

ఈ సందర్భంగా డోరతి మాట్లాడుతూ.. ‘‘డాసన్‌తో సంభాషించేందుకు రెండేళ్లు కష్టపడి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. అయితే, నేను చేసిన సంజ్ఞలు డాసన్‌కు అర్థమయ్యేవి కావు. తనకు చూపు మందగించిందని, నా సంజ్ఞలు సరిగా కనిపించడంలేదని చెప్పాడు. అది కూడా నాటకమే అని ఇప్పుడు అర్థమైంది'' అని తెలిపింది.

క్ల‌బ్బులో ఆడి పాడ‌క‌పోతే ఇంకా కొన‌సాగేది..! కాని టెక్నాల‌జీ ప‌ట్టించింది మ‌న న‌టుడిని..!!

క్ల‌బ్బులో ఆడి పాడ‌క‌పోతే ఇంకా కొన‌సాగేది..! కాని టెక్నాల‌జీ ప‌ట్టించింది మ‌న న‌టుడిని..!!

ఈ ఘటనపై డాసన్ తరపు న్యాయవాది రోబర్ట్ సాన్‌చేజ్ స్పందిస్తూ.. ‘‘నా క్లయింట్ చాలా మౌనంగా ఉంటాడు. పెద్దగా మాట్లాడడు. అతను చెవిటివాడిలా నటకాన్ని కొనసాగించి ఉండకపోతే 60 ఏళ్ల కిందటే ఇద్దరూ విడకాలు తీసుకునేవారు. ఆమె కోసం, కుటుంబం కోసం అతను ఆ నాటకాన్ని కొనసాగించాడు. ఆమెను మోసం చేసే ఉద్దేశం డాసన్‌కు లేదు'' అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఏది ఏమైనా.. 62 ఏళ్లపాటు భార్యకు చిక్కకుండా అంత అద్భుతంగా నటించాడంటే గ్రేటే కదా.. మగజాతికి న‌వ‌ర‌స న‌ట సార్వ‌భౌమ అంటే ఇత‌డేనేమో..!!

English summary
He did not worry about acting as a dumb, deaf to avoid hearing his wife's words. he continued hir drama for 62 years without a little doubt. But he found a little mistress. As a result his wife went to court seeking divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X