Wife: ఇంట్లో భర్తను చంపేసి రెండు రోజులు శవం పక్కన భార్య టైమ్ పాస్, మ్యాటర్ చెప్పిన బంధువులు !

భువనేశ్వర్/ ఒడిశా: దంపతులు ఇద్దరూ కార్పోరేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఉద్యోగరీత్యా భార్య, భర్తల టైమింగ్ప్ వేరుగా ఉన్నాయి. ప్రతినిత్యం దంపతులు ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నారు. రెండో రోజుల నుంచి దంపతులు ఉద్యోగానికి హాజరుకాలేదు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. దంపతులు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి అనుమానం వచ్చి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధులు వెళ్లి చూడగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. భర్త శవమై కనిపించడంతో అతని భార్య శవం పక్కన కుర్చుని ఉంది. రెండు రోజుల పాటు భర్త శవం పక్కన భార్య టైమ్ పాస్ చేసిందని తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్త నిద్రలో చనిపోయాడని భార్య అంటోంది. అయితే భర్త శరీరం మీద అనేక చోట్ల గాయాలు ఉండటంతో అతన్ని భార్య హత్య చేసిందని అతని బంధువులు పోలీసు కేసు పెట్టారు. భర్తను ఆమె భార్య హత్య చేసిందని బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కార్పోరేషన్ లో దంపతుల ఉద్యోగం

కార్పోరేషన్ లో దంపతుల ఉద్యోగం

ఒడిశాలోని భువనేశ్వర్ నగరంలోని మునిసిపల్ కార్పోరేషన్ లో (BMC) శ్యామా ముండారి, జింగి దంపతులు స్వీపర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. శ్యామా ముండారి, జింగి దంపతులు భువనేశ్వర్ లోని కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఉద్యోగరీత్యా భార్య జింగి, ఆమె భర్త శ్యామా ముండారిల టైమింగ్స్ వేరుగా ఉన్నాయి. ప్రతిరోజు దంపతులు ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నారు.

రెండు రోజులు దంపతులు మాయం

రెండు రోజులు దంపతులు మాయం

రెండో రోజుల నుంచి శ్యామా ముండారి, జింగి దంపతులు ఉద్యోగానికి హాజరుకాలేదు. శ్యామా ముండారి, జింగి దంపతుల ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. శ్యామా ముండారి, జింగి దంపతులు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి అనుమానం వచ్చి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు.

శవం పక్కన టైపాస్ చేస్తున్న భార్య

శవం పక్కన టైపాస్ చేస్తున్న భార్య

బంధులు వెళ్లి చూడగా శ్యామా ముండారి చనిపోయిన షాకింగ్ విషయం వెలుగు చూసింది. భర్త శ్యామా ముండారి శవమై కనిపించడంతో అతని భార్య జింగి అతని శవం పక్కన కుర్చుని ఉంది. రెండో రోజుల పాటు భర్త శ్యామా ముండారి శవం పక్కన అతని భార్య జింగి టైమ్ పాస్ చేసిందని తెలుసుకున్న బంధువులు హడలిపోయి భువనేశ్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం


తన భర్త శ్యామా ముండారి నిద్రలో చనిపోయాడని అతని భార్య జింగి అంటోంది. అయితే శ్యామా ముండారి శరీరం మీద అనేక చోట్ల గాయాలు ఉండటంతో అతన్ని ఆమె భార్య జింగి హత్య చేసిందని అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిద్రలో చనిపోయి ఉంటే రెండు రోజులలు జింగి ఎందుకు బంధువులకు సమాచారం ఇవ్వలేదు అని విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అతని బంధువులు అంటున్నారు.

 రోజూ అదే పంచాయితీలు

రోజూ అదే పంచాయితీలు

శ్యామా ముండారి, జింగి దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని బంధువులు అంటున్నారు. ఉద్యోగం చెయ్యాలని జింగి ప్రతిరోజు వేకువ జామున ఎప్పుడుపడితే అప్పుడు నిద్రలేని బయటకు వెళ్లిపోతుందని, ఇదే విషయంలో దంపతుల మద్య రోజూ రామాయణం జరుగుతోందని శ్యామా ముండారి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్యామా ముండారిని అతని భార్య జింగి హత్య చేసిందని బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+