Wife: పండుగ రోజు భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చేసింది, చెల్లెలు ఎంట్రీతో ?, 11 ఏళ్లకు చిక్కిపోయింది !

చెన్నై/ మదురై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. వివాహం జరిగిన తరువాత దంపతులు ఇరు వైపుల ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. వివాహం జరిగిన మొదట్లో భర్త అప్పుడప్పడు మద్యం సేవించేవాడు. రానురాను భర్త రోజూ మద్యం సేవించడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి భర్త లిక్కర్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్లి పీకలదాక మద్యం సేవించి అతని భార్యతో ఓ విషయంలో గొడవ పడేవాడు.

సంక్రాంతి పండుగ సందర్బంగా రెండు క్వాటర్ బాటిల్స్ ఎక్కువ ఇంటికి తీసుకెళ్లిన భర్త పీకలదాక తాగేసి భార్యను పట్టుకుని పాత పంచాయితీ విషయంలో చితకబాదేశాడు. అంతే కోపం తట్టుకోలేని భార్య ఆమె భర్తను వెనక్కి తోసేసి చేతికి చిక్కిన కర్రలు తీసుకుని చికతబాదేసింది. రెచ్చిపోయిన భార్య ఆమె భర్తను చంపేసింది. సోదరి, తండ్రి సహాయంతో ఇంటి ఆవరణంలోనే భార్య శవాన్ని పూడ్చేసిన భార్య సైలెంట్ గా ఉండిపోయింది. భర్త మాయం అయ్యి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. భర్త చెల్లెలికి డౌట్ రావడంతో కేసు పెట్టింది. భర్తను చంపేసిన 11 ఏళ్ల తరువాత అతని భార్య పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది.

 హ్యాపీలైఫ్ అనుకున్న భార్య

హ్యాపీలైఫ్ అనుకున్న భార్య

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని అందిమడం సీపంలోని కులత్తూరు గ్రామంలో గుణశేఖరన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన జయంతి అనే మహిళను గుణశేఖరన్ వివాహం చేసుకున్నాడు. గుణశేఖరన్ ను పెళ్లి చేసుకున్న జయంతి ఆమె భర్తతో కాపురం చేసింది.

 మొదట్లో అంతా ఓకే... కాని ?

మొదట్లో అంతా ఓకే... కాని ?

వివాహం జరిగిన తరువాత గుణశేఖరన్, జయంతి దంపతులు ఇరు వైపుల ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. వివాహం జరిగిన మొదట్లో గుణశేఖరన్ అప్పుడప్పడు మద్యం సేవించేవాడు. రానురాను గుణశేఖరన్ రోజూ మద్యం సేవించడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి గుణశేఖరన్ లిక్కర్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్లి పీకలదాక మద్యం సేవించి అతని భార్య జయంతితో ఓ విషయంలో గొడవ పడేవాడు.

2011 సంక్రాంతి పండుగ రోజు భర్తను చంపేసిన భార్య

2011 సంక్రాంతి పండుగ రోజు భర్తను చంపేసిన భార్య

2011 సంక్రాంతి పండుగ సందర్బంగా రెండు క్వాటర్ బాటిల్స్ ఎక్కువ ఇంటికి తీసుకెళ్లిన గుణశేఖరన్ పీకలదాక మద్యం తాగేసి అతని భార్య జయంతిని పట్టుకుని పాత పంచాయితీ విషయంలో చితకబాదేశాడు. అంతే కోపం తట్టుకోలేని జయంతి మె భర్త గుణశేఖరన్ ను ఇంట్లోనే బలంగా వెనక్కి తోసేసి చేతికి చిక్కిన కర్రలు తీసుకుని చికతబాదేసింది. ఆ సమయంలో రెచ్చిపోయిన జయంతి కత్తి తీసుకుని ఆమె భర్త గుణశేఖరన్ ను పోడిచి చంపేసింది.

 11 ఏళ్లకు భర్త హత్య కేసులో అరెస్టు

11 ఏళ్లకు భర్త హత్య కేసులో అరెస్టు

సోదరి జ్యోతి, తండ్రి మహారాజన్ సహాయంతో ఇంటి ఆవరణంలోనే భర్త గుణశేఖరన్ శవాన్ని పూడ్చేసిన భార్య జయంతి తన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని అందర్ని నమ్మించి సైలెంట్ గా ఉండిపోయింది. భర్త మాయం అయ్యి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. గుణశేఖరన్ చెల్లెలు లక్ష్మీకి డౌట్ రావడంతో ఆమె వదిన జయంతి మీద కేసు పెట్టింది.

 ఎముకలు కూడా మాయం చేసేశారు

ఎముకలు కూడా మాయం చేసేశారు

భర్త గుణశేఖరన్ ను చంపేసిన 11 ఏళ్ల తరువాత అతని భార్య జయంతి, అమె సోదరి జ్యోతి, తండ్రి మహారాజన్ పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది. గుణశేఖర్ ను చంపేసిన రెండు మూడు సంవత్సరాల తరువాత అతని శవంలోని ఎముకలు కూడా తీసుకెళ్లి నదిలో కలిసేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+