తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: ఆర్మీ మొగుడు అని మొదట్లో హ్యాపీ, క్లైమాక్స్ లో భర్తను వెంటాడి వెంటాడి చంపేసిన భార్య !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ క్రిష్ణగిరి/ తిరుపతి: ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనేక చోట్ల పెళ్లి సంబంధాలు చూశారు. బంధువులు, తెలిసిన వాళ్లు కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి కూతురి కోసం తెలిసిన వాళ్ల సహాయంతో మంచి అమ్మాయి కోసం వెతికారు. బంధువులు ఓ అమ్మాయిని చూడటంతో రెండు కుటుంబాల పెద్దలు పెళ్లి విషయంలో అన్నీ మాట్లాడుకుని పెళ్లి సంబంధం సెట్ చేశారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఆర్మీలో ఉద్యోగం చూస్తున్న వ్యక్తి సెలవుల మీద సొంత ఊరికి వెళ్లి వస్తూ అతని భార్యతో సంతోషంగానే కాపురం చేశాడు. రానురాను దంపతుల మద్య తేడాలు రావడంతో భార్య ఆమె భర్తతో గొడవలు పడి నీ అంతు చూస్తాను అంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య దూరం కావడానికి ఆమె పుట్టింటి వాళ్లు, బంధువులు కారణం అని భర్త రగిలిపోయాడు. నేరుగా భార్య పుట్టింటికి వెళ్లిన భర్త అక్కడ గొడవ పెట్టుకుని అతని భార్య తండ్రిని దారుణంగా చంపేశాడు. హత్య కేసులో ఆర్మీ ఉద్యోగి జైలుపాలైనాడు. బెయిల్ మీద బయకు వచ్చిన అతను తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ ధీమా తిరిగాడు. తండ్రిని చంపిన భర్త మీద పగ పెంచుకున్న భార్య, ఆమె బావ, బంధువులతో కలిసి భర్త ఉన్న అడ్రెస్ తెలుసుకుని అక్కడికి వెళ్లింది. అంతే భార్య, ఆమె బంధువులు వెంటాడి వెంటాడి భర్తను దారుణంగా చంపేయడం కలకం రేపింది. గతంలో మామను చంపేసి భర్త ఎలా కోర్టులో లొంగిపోయాడో ఇప్పుడు అదే భర్తను చంపేసిన అతని భార్య కూడా అదే టైపులో కోర్టులో లొంగిపోయింది.

Hijab Row: హిజాబ్, చెప్పిందే చెప్పి కోర్టు టైమ్ వేస్ట్ చేస్తున్నారు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు !Hijab Row: హిజాబ్, చెప్పిందే చెప్పి కోర్టు టైమ్ వేస్ట్ చేస్తున్నారు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు !

ఆర్మీలో ఉద్యోగం

ఆర్మీలో ఉద్యోగం


తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా (కర్ణాటక సరిహద్దు జిల్లా)లోని పోచంపల్లి తాలుకాలోని పరూర్ సమీపంలోని పన్నంతూరులోని ఇందిరానగర్ కాలనీలో సొక్కలింగం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొక్కలింగం కుమారుడు నరేష్ కుమార్ (40) అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ లో ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు.

 చాలా మంది అమ్మాయిలను చూశారు

చాలా మంది అమ్మాయిలను చూశారు

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న నరేష్ కుమార్ కు వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనేక చోట్ల పెళ్లి సంబంధాలు చూశారు. బంధువులు, తెలిసిన వాళ్లు కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న నరేష్ కుమార్ కు పెళ్లి కూతురి కోసం తెలిసిన వాళ్ల సహాయంతో మంచి అమ్మాయి కోసం వెతికారు.

ఇద్దరు కొడుకులు, కూతురు

ఇద్దరు కొడుకులు, కూతురు

బంధువులు శశికళ (36) అనే మహిళను చూడటంతో రెండు కుటుంబాల పెద్దలు పెళ్లి విషయంలో అన్నీ మాట్లాడుకుని పెళ్లి సంబంధం సెట్ చేశారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న నరేష్ కుమార్, శశికళ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఆర్మీలో ఉద్యోగం చూస్తున్న నరేష్ కుమార్ సెలవుల మీద సొంత ఊరికి వెళ్లి వస్తూ అతని భార్య శశికళతో సంతోషంగానే కాపురం చేశాడు.

 అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన భార్య

అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన భార్య


నరేష్ కుమార్, శశికళ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. తరువాత నరేష్ కుమార్ ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రానురాను దంపతుల మద్య తేడాలు రావడంతో భార్య ఆమె భర్తతో గొడవలు పడి నీ అంతు చూస్తాను అంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చి గత ఏడాది మార్చి నెలలో పుట్టింటికి వెళ్లిపోయింది. శశికళ ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటిలోనే ఉంటున్నది.

 భార్య కళ్ల ముందే ఆమె తండ్రిని చంపేసిన భర్త

భార్య కళ్ల ముందే ఆమె తండ్రిని చంపేసిన భర్త

తన భార్య శశికళ తనకు దూరం కావడానికి ఆమె పుట్టింటి వాళ్లు, బంధువులు కారణం అని నరేష్ కుమార్ రగిలిపోయాడు. పంచాయితీలు చేసినా శశికళ మాత్రం ఆమె భర్త నరేష్ కుమార్ దగ్గరకు రాలేదు. అంతే గత ఏడాదిలొనే భార్య శశికళ పుట్టింటికి వెళ్లిన భర్త అక్కడ గొడవ పెట్టుకుని భార్య తండ్రి మహాలంగంను దారుణంగా చంపేశాడు. హత్య కేసులో నరేష్ కుమార్ క్రిష్ణగిరి కోర్టులో లొంగిపోయాడు. తరువాత నరేష్ కుమార్ ను సేలం సెంట్రల్ జైలుకు పంపించారు.

భర్తను వెంటాడి వెంటాడి నరికేసిన భార్య

భర్తను వెంటాడి వెంటాడి నరికేసిన భార్య


సేలం సెంట్రల్ జైల్లో ఉన్న నరేష్ కుమార్ తరువాత బెయిల్ మీద బయకు వచ్చి తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ ధీమా తిరిగాడు. తండ్రి మహాలింగంను చంపిన భర్త నరేష్ కుమార్ మీద పగ పెంచుకున్న అతని భార్య శశికళ, ఆమె బావ, బంధువులతో కలిసి భర్త ఉన్న పన్నంతూరుకు వెళ్లింది. అంతే భార్య శశికళ, ఆమె బంధువులు కలిసి నరేష్ కుమార్ ను వెంటాడి వెంటాడి దారుణంగా నరికేశారు.

భర్త లొంగిపోయినట్లు భార్య కూడా లొంగిపోయింది

భర్త లొంగిపోయినట్లు భార్య కూడా లొంగిపోయింది

తీవ్రగాయాలైన నరేష్ కుమార్ ను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నరేష్ కుమార్ చనిపోయాడని పోలీసులు అన్నారు. భర్త నరేష్ కుమార్ హత్య కేసులో శశికళ క్రిష్ణగిరి కోర్టులో లొంగిపోయింది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని క్రిష్ణగిరి జిల్లా పోలీసులు తెలిపారు. భర్తను అతని భార్య వెంటాడి వెంటాడి చంపేయడం కలకం రేపింది.

English summary
Wife: Woman killed her husband near Krishnagiri in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X