Wife: భార్య టైమ్ కు టేస్టుగా చిల్లీ చికెన్ చెయ్యలేదని మొగుడు ఏం చేశాడంటే ?, వీడి మామూలోడు కాదు !
బెంగళూరు: వివాహం చేసుకున్న భర్తతో అతని భార్య సంతోషంగా కాపురం చేసింది. చక్కగా కాపురం చేసిన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉంటున్న భార్య సంతోషంగా ఉంటున్నది. కొంతకాలం నుంచి దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. బయటకు వెలుతున్న భర్త నేను ఇంటికి వచ్చే సరికి టేస్టుగా చిల్లీ చికెన్ చేసి పెట్టాటని అతని భార్యకు చెప్పాడు. ఇంటి వచ్చిన భర్త ఇంట్లో చిల్లీ చికెన్ రెడీగా లేకపోవడంతో అతని భార్య మీద రగిలిపోయాడు. చిల్లీ చికెన్ చెయ్యలేదని భార్యను దారుణంగా చంపేసిన భర్త ఆమె శవాన్ని చెరువులో విసిరేశాడు. హత్యకు గురైన భార్య శవం చెరువులో తేలిపోవడంతో పోలీసులు విచారణ చెయ్యడంతో అసలు విసయం తెలుసుకుని షాక్ అయ్యారు.

భార్యతో సంతోషంగా ఉన్నాడు
కర్ణాటకలోని దావణగెరెకి చెందిన ముబారక్ (33) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం సిరీన్ (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ముబారక్, సిరీన్ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కుటుంబ సభ్యులు చూపించిన ముబారక్ ను వివాహం చేసుకున్న సిరీన్ అతనితో సంతోషంగా కాపురం చేసింది.

డబ్బులు సంపాదించాలని ఆశ
డబ్బులు సంపాదించాలని ఆశతో ముబారక్, సిరీన్ దంపతులు ఐటీ హబ్ బెంగళూరుకు చేరుకుని సోలదేవనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తరబనహళ్ళిలో కాపురం పెట్టారు. అద్దె ఇంటిలో ఉంటున్న ముబారక్, సిరీన్ దంపతులు చక్కగా కాపురం చేశారు. ముబారక్, సిరీన్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చిల్లీ చికెన్ చెయ్యాలని చెప్పిన భర్త
కొంతకాలం నుంచి ముబారక్, సిరీన్ దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ముబారక్ సమీపంలోని షాపులో చికెన్ తీసుకెళ్లి భార్య సిరీన్ చేతికి ఇచ్చాడు. పనిమీద బయటకు వెలుతున్న భర్త ముబారక్ నేను ఇంటికి వచ్చే సరికి చిల్లీ చికెన్ చేసి పెట్టాటని అతని భార్య సిరీన్ కు చెప్పాడు. ఇంటికి వెళ్లిన భర్త ముబారక్ ఇంట్లో చిల్లీ చికెన్ రెడీగా లేకపోవడంతో అతని భార్య సిరీన్ మీద రగిలిపోయాడు.

చిల్లీ చికెన్ కోసం భార్యను చంపేశాడు
చిల్లీ చికెన్ చేసే విషయంలో ముబారక్, సిరీన్ దంపతుల విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ముబారక్ అతని ఇంట్లోనే భార్య సిరీన్ ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. బెంగళూరు శివార్లలోని చిక్కబాణవార చెరువులో భార్య సిరీన్ శవాన్ని తీసుకెళ్లి చెరువులో విసిరేసిని ముబారక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సిరీన్ శవం చెరువులో తేలిపోవడంతో సోలదేవనహళ్ళి పోలీసులు రంగంలోకి దిగారు.

భర్త క్లారిటీతో పోలీసుల మతిపోయింది
హత్యకు గురైంది సిరీన్ అని తెలుసుకున్న పోలీసులు ముబారక్ ను అరెస్టు చేశారు. అయితే తన భార్య సిరీన్ ను ఎందుకు హత్య చేశాను అనే విషయంలో ముబారక్ క్లారిటీ ఇవ్వడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. తాను పదే పదే చిల్లీ చికెన్ చెయ్యాలని తన భార్య సిరీన్ కు చెప్పినా ఆమె నా మాట వినలేదని, ఆవేశంలో తానే చంపేశానని చెప్పడంతో సోలదేవనహళ్ళి పోలీసులు షాక్ అయ్యారు. మొత్తం మీద చిల్లీ చికెన్ కోసం భార్య సిరీన్ ను చంపేసి శవాన్ని చెరువులో విసిరేసి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన ముబారక్ ను పోలీసులు విచారణ చెయ్యడంలో హాట్ టాపిక్ అయ్యింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications