Wife: భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేసిన భర్త, అత్తకు ఫోన్ చేసి ఏంచెప్పాడంటే ? !
చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. రానురాను ఇంట్లో జరుగుతున్న పంచాయితీలు భార్య బయటకు చెప్పలేకపోయింది. ఇదే సమయంలో భర్త అతని భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మా కూతురిని అల్లుడు, అతని కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

సంతోషంగా ఉండాలని అనుకుంది
తమిళనాడులోని సేలంలోని రెడ్డిపట్టి ప్రాంతంలో ధనుశ్రేయస్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం కీర్తిరాజ్ అలియాస్ కీర్తి అనే యువతిని ధనుశ్రేయస్ వివాహం చేసుకున్నాడు. భర్తతో జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని అనుకున్న కీర్తి అత్తారింటికి వెళ్లింది.

కట్నం కావాలని టార్చర్
భర్త ధనుశ్రేయస్ తో సంతోషంగా కాపురం చేస్తున్న కీర్తికి అత్తారింటిలో కష్టాలు ఎదరైనాయి. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు పెరియస్వామి, రంజనీలు టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. నువ్వు బయటకు వెళ్లిన తరువాత మీ అమ్మానాన్న కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నారని కీర్తి ఆమె భర్త ధనుశ్రేయస్ కు చెప్పింది.

భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేసిన భర్త
రానురాను ధనుశ్రేయస్, కీర్తి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ధనుశ్రేయస్, కీర్తి దంపతుల మద్య ఎలాంటి ఫలితం లేకపోయింది. రానురాను ఇంట్లో జరుగుతున్న పంచాయితీలు కీర్తి బయటకు చెప్పలేకపోయింది. రాత్రి గొడవ ఎక్కువ కావడంతో ధనశ్రేయస్ క్రికెట్ బ్యాట్ తీసుకుని అతని భార్య కీర్తిని కొట్టి చంపేశాడు.

డ్రామలు ఆడిన భర్త
ధనుశ్రేయస్ అతని భార్య కీర్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మా కూతురు కీర్తిని అల్లుడు ధనుశ్రేయస్, అతని తల్లిదండ్రులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కీర్తి సురేష్ ను క్రికెట్ బ్యాట్ తో కొట్టి టార్చర్ పెట్టి హత్య చేశారని వెలుగు చూసింది. కీర్తి భర్త ధనుశ్రేయస్, అతని తండ్రి పెరియస్వామి, తల్లి రంజనీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సేలం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications