Wife: అర్దరాత్రి నాభర్తను ఎవరో కొట్టి చంపేశారు, కేకలు వేసిన భార్య, తల్లీ కొడుకు నాటకాలతో షాక్ !
చెన్నై/ తేని: దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మేస్త్రీ పని చేస్తున్న వ్యక్తి అతని భార్య, పిల్లలను పోషించాడు. ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసుకుని వారి భర్తలతో కలిసి నివాసం ఉంటున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులు మాత్రమే ఇంటిలో ఉంటున్నారు. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సెలవుల మీద ఇంటికి వెళ్లిన కొడుకు తల్లిదండ్రులకు సర్దిచెబుతూ వస్తున్నారు. అర్దరాత్రి తల్లీ కొడుకు ఇంటి బయటకు వెళ్లారు. ఇంటి ముందు ఉన్న తన భర్త మీద ఎవరు దాడి చేశారని, అతను చనిపోయాడని గట్టిగా కేకలు వేసింది. అయితే పోలీసుల విచారణలో తల్లీ కొడుకుల అసలు డ్రామా మొత్తం బయటకు వచ్చింది.

ఇద్దరు కుమార్తెలు
తమిళనాడులోని తేనీ జిల్లాలోని అంటిపట్టి తాలుకాలోని కందనూరు ఉలసిపట్టి గ్రామంలో మునియాండి (55), మురగేశ్వరి (48) దంపతులునివాసం ఉంటున్నారు. మునియాండి, మురగేశ్వరి దంపతులకు పూంగోడి, జ్యోతిలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు, కాళిదాస్ (29) అనే కుమారుడు ఉన్నారు. మేస్త్రీ పని చేస్తున్న మునియాండి అతని భార్య మురగేశ్వరి, ముగ్గురు పిల్లలను పోషించాడు.

కూతుర్లు హ్యాపీ..... చెన్నైలో కొడుకు ఉద్యోగం
మునియాండి, మురగేశ్వరి దంపతులు వారి ఇద్దరు కుమార్తెలు పూంగోడి, జ్యోతిలక్ష్మిలకు కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లి చెయ్యడంతో ఇద్దరూ వారివారి భర్తలతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు. కుమారుడు కాళిదాస్ కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై చేరుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

రాత్రి అయితే నిషాలో ?
కూతుర్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం, కొడుకు చెన్నైలో ఉండటంతో మునియాండి, మురగేశ్వరి దంపతులు మాత్రమే ఇంటిలో ఉంటున్నారు. మేస్త్రీగా పని చేస్తున్న మునియాండి రోజు మద్యం సేవిస్తూ రాత్రి ఇంటికి వెళ్లి ఏదో ఒక విషయంలో అతని భార్య మరగేవ్వరితో గొడవలు పడుతున్నాడు.

కిక్కులో భార్యను చితకబాదేశాడు
కొంతకాలం నుంచి మునియాండి, మురగేశ్వరి దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సెలవుల మీద చెన్నై నుంచి ఇంటికి వెళ్లిన కాళిదాసు రోజు తల్లిదండ్రులు గొడవపడుతున్న విషయం గమనించి ఇద్దరికి సర్దిచెబుతూ వస్తున్నారు. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మునియాండి అతని భార్య మురగేశ్వరిని చితకబాదేశాడు. ఆ

తల్లీ కొడుకు నాటకాలు
సందర్బంలో అడ్డువెళ్లిన కాళిదాసు అతని తండ్రిని బలంగా వెనక్కి తోసేశాడు. మద్యం మత్తులో వెనక్కిపడిపోయిన మునియాండి తల పగలిచనిపోయాడు. మునియాండి శవాన్ని ఇంటి బయట గుమ్మం దగ్గరకు తెచ్చి పెట్టారు. అర్దరాత్రి తల్లీ కొడుకు ఇంటి బయటకు వెళ్లారు. ఇంటి ముందు ఉన్న తన భర్త మీద ఎవరు దాడి చేశారని, అతను చనిపోయాడని మురగేశ్వరి గట్టిగా కేకలు వేసింది.

సీన్ మొత్తం మారిపోయింది
అయితే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మునియాండి తల వెనుక బలమైన గాయం ఉండటంతో పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో తల్లీ మురగేశ్వరి, కొడుకు కాళిదాసు రాత్రి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పారు. భార్య, కొడుకు కలిసి మునియాండిని హత్య చేశారని వెలుగు చూడటంతో మరగేశ్వరి, కాళిదాసును అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.