రంజుగా యూపీ పోరు-బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా ? సెమీఫైనల్స్ పై దేశవ్యాప్త ఆసక్తి

దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఓ ఎత్తయితే యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని ఇతర పార్టీలకు కూడా ఓ ఎత్తుగా మారుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ భారీ సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్ధానాలే. ఇందులో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ఎప్పుడూ ఉంటుంది. దీనికి తోడు ఈసారి బీజేపీ అనురిస్తున్న విధానాల ఫలితంగా యూపీలో అదికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అన్చ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా పరిస్ధితిపై ఓ విశ్లేషణ.

యూపీలో బలీయశక్తిగా బీజేపీ

యూపీలో బలీయశక్తిగా బీజేపీ

ఉత్తర్ ప్రదేశ్ లో మూడేళ్ల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దాదాపు 50 శాతానికి పైగా ఓట్లు సాధించి బలీయ శక్తిగా మారిపోయింది. దీంతో అప్పటికే అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి బలం మరింత పెరిగినట్లయింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంటున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి అక్కడ గెలిస్తే దేశ రాజకీయాల్లో ఇది మరో సంచలనం కావడం ఖాయం. అలా కాక ఓడిపోతే మాత్రం అది కచ్చితంగా బీజేపీ స్వయంకృతాపకరాధమే అవుతుందన్న అంచనాలున్నాయి. దీంతో యూపీలో బీజేపీ గెలుస్తుందా లేదా అనే అంశంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.

యూపీలో గెలిస్తే 2024 గెలిచినట్లే

యూపీలో గెలిస్తే 2024 గెలిచినట్లే

ఉత్తర్ ప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా కేంద్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమని బీజేపీ భావిస్తోంది. యూపీలో గెలుపు బీజేపీకి 2024 ఎన్నికల ద్వారాలు తెరుస్తుందని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చూస్తే కాషాయ దళం ఈ పోరును ఎంత సీరియస్ గా దీసుకుంటుందో ఇట్టే అర్ధమవుతుంది. ఇంత కచ్చితంగా బీజేపీ లెక్కలేసుకుంటున్న యూపీలో బీజేపీ తాజా పరిస్ధితి ఎలా ఉందనే ఆసక్తి దేశంలో కనీస రాజకీయ పరిజ్ఢానం ఉన్న అందరిలోనూ పెరుగుతోంది.

రెండేళ్లలో పెరిగిన సవాళ్లు

రెండేళ్లలో పెరిగిన సవాళ్లు

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన బీజేపీకి ఈ రెండేళ్లలో మాత్రం సవాళ్లు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలోనే ఈ సవాళ్లు ఉండటం కాషాయ శిబిరాన్ని కలవరపెడుతోంది. ప్రజలలో అధికార వ్యతిరేక సెంటిమెంట్, పెరుగుతున్న చమురు ధరల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణం, కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, కనీస మద్దతు ధరలకు చట్టపరమైన హామీ కోరుతూ రైతులలో పెరుగుతున్న ఆందోళన అధికార పార్టీ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే ఇప్పుడు తాము తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని తామే రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితి బీజేపీకి ఎదురైంది.

పుంజుకుంటున్న అఖిలేష్ పార్టీ

పుంజుకుంటున్న అఖిలేష్ పార్టీ

తాజాగా వ్యవసాయ బిల్లుల రద్దుపై ప్రధాని మోడీ చేసిన ప్రకటనను విపక్షాలు యూపీతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ రైతుల పోరాటానికి లింక్ చేసి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపీ సవాళ్లు ఎదుర్కొంటోంది. అదే సమయంలో యూపీలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలు తాజాగా ఇదే అంశంతో బలపడుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. అందులోనూ అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ బీజేపీకి పోటీగా గణనీయంగా బలపడుతున్నట్లు ఈ సర్వేల్లో తేలింది. దీంతో ఈ అంశం కూడా బీజేపీని తీవ్రంగా కలవరపెడుతోంది.

అయినా బలంగానే కమలం

అయినా బలంగానే కమలం

విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ, యోగీ సర్కార్ పై వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ బీజేపీ 2014 నుంచి ఇప్పటివరకూ పెంచుకుంటూ పోతున్న ఓటు బ్యాంకు కాషాయ శిబిరానికి శ్రీరామరక్ష అవుతుందని ఇప్పటికీ సెఫాలజిస్టులు నమ్ముతున్నారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటుందని భావించి విపక్షాలు పోరు పెడుతున్నా అంతిమంగా బీజేపీ సాధిస్తున్న విజయాలు, ఓట్లు, సీట్ల సంఖ్యలో వచ్చిన మార్పు మాత్రం స్వల్పమే. దీంతో మరోసారి అసెంబ్లీ పోరును ఎదుర్కొంటున్న బీజేపీ ఇక్కడ బలంగానే ఉన్నట్లు చెప్పొచ్చు. ఈ మూడు నెలల్లో అద్భుతాలేవీ జరగకపోతే తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం కూడా సునాయాసమే అని తెలుస్తోంది.

 హిందూత్వ వ్యూహంతోనే ఎన్నికలకు

హిందూత్వ వ్యూహంతోనే ఎన్నికలకు

అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి కేంద్ర బిందువైన యూపీలో ప్రస్తుతం రామాలయం నిర్మాణం జరుగుతుండటం, యోగీ ఆదిత్యనాథ్ వాక్ చాతుర్యం, విపక్షాలను మైనార్టీలను బుజ్జగించే పార్టీలుగా బీజేపీ వేస్తున్న ముద్ర కలగలిసి బీజేపీకి మరోమారు అధికారాన్ని కట్టబెట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. ముఖ్యంగా ఓట్ల పోలరైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ పునాదులు ఇప్పటికీ బలంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇది కచ్చితంగా యూపీలో తమకు మరోసారి పోటీగా ఎదుగుతున్న సమాజ్ వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకునే అని తెలుస్తోంది. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ నమ్ముకున్న ముస్లిం ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ బీజేపికి అనుకూలంగా హిందువులను పోలరైజ్ చేసే పనిలో అమిత్ షా బిజీగా కనిపిస్తున్నారు. దీంతో బీజేపీ ఇదే వ్యూహంతో రేపు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దపడుతోందని తేలిపోయింది.

Recommended Video

    Farm Laws Repeal : Pawan Kalyan మంచి ముగింపు.. పోరాటం విలువ | PM Modi || Oneindia Telugu
    ప్రజా వ్యతిరేకత తట్టుకుంటే గెలిచినట్లే

    ప్రజా వ్యతిరేకత తట్టుకుంటే గెలిచినట్లే

    యూపీలో అధికారంలో ఉన్న పార్టీలను కాదని విపక్షాలకు ఓటు వేసే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. దీంతో ఈసారి ప్రజా వ్యతరేకతపైనా బలంగా చర్చ సాగుతోంది. అదే సమయంలో యోగీ సర్కార్ పాలనలో కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యం, గంగానదిలో తేలుతూ కనిపించిన మృతదేహాలు, హత్రాస్ బాధితురాలిని అర్ధరాత్రి 3 గంటలకు దహనం చేయడం, లఖీంపూర్ ఖేరీలో బీజేపీ కేంద్రమంత్రి కుమారుడు రైతులపై కారు దూసుకెళ్లి నలుగురు రైతులు చనిపోవడం వంటి ఘటనలు బీజేపీకి సమస్యలు సృష్టిస్తున్నాయి.

    శాంతిభద్రతల్ని కాపాడే పేరుతో మైనార్టీలను టార్గెట్ చేయడం, మతమార్పిడుల చట్టాన్ని ప్రయోగించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణల్ని యోగీ సర్కార్ ఎదుర్కొంటోంది. వీటిని మైనార్టీలు విపక్షాల్ని బుజ్జగిస్తున్నాయన్న కార్డుతో ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రజా వ్యతిరేకతను బీజేపీ వ్యూహాలు ఏమాత్రం తట్టుకుంటాయాన్న దానిపైనే కాషాయ విజయం ఆధారపడి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+