Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

షిమ్లా : లోక్‌సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసులు నమోదవుతుంటే.. మరికొన్ని చోట్ల కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తోంది. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొందరైతే ఈసీ నిషేధం విధించినా.. తమ నోటికి మాత్రం తాళం వేయలేకపోతున్నారు. ఆ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ సత్‌పాల్ సింగ్‌ సట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు.

మూడోదశ ఎన్నికలు ముగిసి ఫోర్త్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సత్‌పాల్ సింగ్‌ సట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఎవరైనా వేలు చూపిస్తే.. భుజాలు నరికేస్తామంటూ" వివాదస్పదంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది.

Will chop off arms of those who point fingers at Modi says Himachal BJP chief Satpal singh

ఈ నెల 13వ తేదీన ప్రచార సభలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సత్‌పాల్ సింగ్‌.. కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఆయనపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. అంతేకాదు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే నిషేధం ముగిసి మళ్లీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మళ్లీ నోరు జారడం విస్మయం కలిగిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+