వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికి నూతన ప్రధానిని అందిస్తాం..! లక్నోలో అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన..!!

|
Google Oneindia TeluguNews

లక్నో/హైదరాబాద్ : దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్లు, ఆరోపణలు. ప్రత్యారోపణలతో దేశం ఎన్నికల వేడిని రగుల్చుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎస్పీ-బీఎస్పీ కూటమి దేశానికి తదుపరి ప్రధానిని అందిస్తుందని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ చెప్పారు. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము బీఎస్పీతో జట్టుకట్టామని వెల్లడించారు. యూపీలోని కన్నౌజ్‌లో గురువారం జరిగిన ప్రచార ర్యాలీలో బీఎస్పీ చీఫ్‌ మాయావతితో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. కాగా ఇదే వేదికపై నుంచి మాయావతి ప్రసంగించేందుకు ముందు అఖిలేష్‌ భార్య, కన్నౌజ్‌ నుంచి పోటీ చేస్తున్న డింపుల్‌ యాదవ్‌ మాయావతి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

will give new pm for the country.!Akhilesh sensational announcement in Lucknow !!

కాగా ఏప్రిల్‌ 29న సహరన్‌పూర్‌, ఖేరి, హర్దోయ్‌, మిశ్రిఖ్‌, ఉన్నావ్‌, ఫరక్కాబాద్‌, ఇటావా, కాన్పూర్‌, అక్బర్‌పూర్‌, జలన్‌, ఝాన్సీ, హమీర్పూర్‌ స్ధానాలతో పాటు కన్నౌజ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కీలకమైన యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకునేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీలు పోటీపడుతుండగా, ప్రియాంక ప్రచారంతో తమ విజయావకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఓ పక్క ప్రధాని మోదీ నామినేషన్ వేస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ ప్రకటనలు మరింత సంచలనం రేపుతున్నాయి.

English summary
SP chief Akhilesh Yadav said SP-BSP will provide the next prime minister after the Lok Sabha polls. He said they have teamed up with the BSP to stop the BJP from coming to power at the Center for next time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X