ప్రియాంక గాంధీ భర్తను జైలుకు పంపిస్తా: ఉమా భారతి
ఝాన్సీ: తన చేతికి అధికారం వస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానని బిజెపి నేత ఉమా భారతి అన్నారు. ఎన్డీయె అధికారంలోకి వస్తే వాద్రాను జైలుకు పంపిస్తామని అని ఆమె అనడం ఇది రెండోసారి. నియమాలను అన్నింటినీ ఉల్లంఘించి వాద్రా సొమ్ము చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
సోనియా గాంధీ అల్లుడు కావడంతో కాంగ్రెసు పాలిత రాష్ట్రాలన్ని రాబర్ట్ వాద్రాకు భయపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వాద్రా వల్ల కేంద్ర మంత్రులు కూడా ఒత్తిడికి గురవుతున్నారని ఆమె అన్నారు. ఆదివారం రాత్రి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తన పార్టీ తన పట్ల కొంత వ్యతిరేకత చూపవచ్చు గానీ తన చేతుల్లోకి అధికారం వస్తే వాద్రాను జైలుకు పంపిస్తానని ఆమె అన్నారు. వాద్రా చాలా తప్పులు చేశారని ఉమా భారతి గతవారం అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తా రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్తారని ఆమె అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాము అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని, సానుకూల దృక్పథంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎవరి పట్ల కూడా వేధింపు ధోరణితో వ్యవహరించదని, ఇతర వేధింపులకు తాను గత 12 ఏళ్లుగా బాధపడుతూ వస్తున్నానని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications