కథూవా కేసు: తప్పు చేశాడో లేదో అడుగుతా, జీవితాంతం వేచి చూస్తా: దీపక్‌కు కాబోయే భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

జమ్మూకాశ్మీర్: కథూవా అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ దీపక్‌ కజురియా అలాంటి వ్యక్తి కాడని ఆయనకు కాబోయే భార్య అభిప్రాయపడుతోంది. ఈ విషయమై తాను అతను తప్పు చేశాడా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకొంటానని ఆమె ప్రకటించారు.

కథువా రేప్ ఘటనలో దీపక్‌ కజూరియా అనే పోలీసు కూడ నిందితుడిగా ఉన్నాడు దీపక్‌ కజూరియాకు స్థానికంగా ఉన్న యువతితో గత ఏడాది డిసెంబర్ మాసంలో నిశ్చితార్ధం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరగాల్సి ఉంది.

అయితే కథూవా రేప్ కేసులో దీపక్ కూడ ఉన్నాడని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసులో ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తనకు కాబోయే భర్త అలాంటి మనస్థత్వం కలవాడు కాదని దీపక్‌తో నిశ్చితార్ధమైన యువతి అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని తాను దీపక్‌ను అడిగి తెలుసుకొంటానని చెబుతోంది. దీపక్‌ను కలిసేందుకు తనకు అనుమతి కావాలని ఆమె కోరుతున్నారు.

Will look him in the eye, ask if he committed the crime, says fiancé of cop accused in Kathua rape

దీపక్ కళ్ళలోకి చూసి ఈ తప్పు చేశావా, లేదా అని అడుగుతానని ఆమె చెబుతున్నారు. ఒకవేళ దీపక్ ఈ విషయంలో తప్పు చేయలేదని తెలిస్తే జీవితాంతం అతడి కోసం ఎదురు చూస్తానని ఆమె ప్రకటించారు. అతను తప్పు చేయడని ఆమె అభిప్రాయపడ్డారు.

కథూవా కేసులో దీపక్ తప్పుందని తెలిస్తే తాను మరో వ్యక్తిని వివాహం ఆడుతానని ఆమె తేల్చి చెప్పారు. దీపక్ జైలుకెళ్ళిన తర్వాత ఆ కుటుంబసభ్యులు ఎవరూ కూడ దీపక్ వద్దకు వెళ్ళలేదు. నిశ్చితార్ధమయ్యాక ప్రతిరోజూ కూడ తామిద్దరం ఫోన్లో మాట్లాడుకొనేవాళ్ళమని ఆమె చెప్పారు. ఏనాడూ కూడ దీపక్ తప్పుడుగా తనతో మాట్లాడలేదన్నారు.సీబీఐ దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Twenty-four-year-old Renu Sharma is desperate for one visit to the district jail in Kathua before she takes a call on her future. She wants to speak to her fiancé Deepak Khajuria, a local policeman who is accused of involvement in the rape and murder of an eight-year-old girl in Rasana village.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి