• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్ని ఛానళ్ల కంటే మెరుగ్గా ‘దూరదర్శన్’: ప్రసార భారతి కొత్త సీఈఓ వెంపటి

|

న్యూఢిల్లీ: శశి శేఖర్ వెంపటి గత శుక్రవారం ప్రసార భారతి బోర్డ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. వెంపటి నియామకమైన వెంటనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, వెంపటి సారథ్యంలో ప్రసార భారతి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆకాంక్షించారు.

రానున్న ఐదేళ్లలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఛానళ్లలో నూతన సంస్కరణలు తీసుకొస్తారనే అంచనాలు ఐఐటీ బొంబే పూర్వ విద్యార్థి అయిన శశి శేఖర్‌పై ఉన్నాయి. 2022 వరకు డీడీ అండ్ ఎయిర్ ఛానళ్లను పూర్తిగా మార్చేస్తామని శశి శేఖర్ వన్ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేగాక, ఇప్పటి వరకు చూసిన డీడీ అండ్ ఎయిర్‌కి ఇకముందు చూసే డీడీ అండ్ ఎయిర్‌కి స్పష్టమైన తేడా కనిపిస్తుందన్నారు.

ప్రసార భారతిపై నమ్మకాన్ని తీసుకోస్తారా?

ప్రసార భారతిపై ఉన్న నమ్మకాన్ని తిరిగి తీసుకురావడంతోపాటు పెంచుతామని శశిశేఖర్ తెలిపారు. అంతేగాక, సంస్థను నమ్ముకున్న స్టేక్ హోల్డర్స్, బహిర్గత భాగస్వాములు, సంస్థకు చెందిన పెద్ద సంఖ్యలోని సిబ్బందిలో కూడా విశ్వాసం పెంచుతామని తెలిపారు. ప్రసార భారతి, డీడీ అండ్ ఎయిర్ సంస్థలు ఒకే ఫ్యామిలీ కిందికి వస్తాయని చెప్పారు.

Will make all TV channels look like a pale version of Doordarshan says new Prasar Bharati boss

దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల కారణంగా డీడీ నమ్మకంపై ప్రభావం పడిందని చెప్పారు. ప్రసార భారతి, వర్క్ ఫోర్స్, ప్రసార భారతి పరివార్ లోని పలు అంశాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్‌‌పై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అయితే, తాము ఇప్పటి నుంచి అహర్నిశలు శ్రమించి ప్రసార భారతి ప్రతిష్టను మరింత పెంచడంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో కూడా ముందుంచుతామని చెప్పారు.

మాల్గుడి డేస్ లాంటి సీరియళ్లను మళ్లీ టెలీకాస్ట్ చేస్తారా? వీక్షకులను పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు?

జ్ఞాపకాల(జరిగిన ఘటనల)ను భద్రపర్చడమనేది డీడీకి ఒక ఆస్తి. బ్రాండ్ నిజాయితీని పెంచేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. వీక్షకులను ఆకట్టుకునేందుకు కూడా ఇతర ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రజల జీవితానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తామని తెలిపారు.

బీబీసీ, ఆల్-జజిరా ల్లాగా దూరదర్శన్ అండ్ ఎయిర్(ఎఐఆర్) అంతర్జాతీయంగా వాయిస్ వినిపిస్తుందా?

వందకోట్లకుపైగా భారతీయుల సాంప్రదాయాలు, విలువల, ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజేస్తాన్నారు. అది తమ బాధ్యత అని తెలిపారు. ప్రపంచం భారతదేశం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2022నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని స్వాతంత్ర్య భారతం వాణి వినిస్తామని తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ పరిణామాలపై భారత గళాన్ని కూడా ప్రపంచం వినాలనుకుంటోందని తెలిపారు. అందుకే అంతర్జాతీయ ప్లాట్ ఫాం ఏర్పరచుకుంటామని తెలిపారు. ప్రసార భారతి ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోందని చెప్పారు.

సోషల్ మీడియాలో దూరదర్శన్ అండ్ ఎయిర్ ఎలా ఉండాలనుకుంటున్నారు?

ఇప్పుడే సోషల్ మీడియాలో సంచలనాల దిశగా సాగుతున్నామని చెప్పారు. మరింతంగా విస్తరించి నెటిజన్లకు కూడా దగ్గరవుతామని తెలిపారు. సోషల్ మీడియా అధిక ప్రాధాన్యతనిచ్చి విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు.

ప్రస్తుతం డిజిటల్ రంగంలో డీడీ అండ్ ఎయిర్ ప్రణాళికలు?

డిజిటల్ రోడ్ మ్యాప్‌తో విజన్ 2020లక్ష్యంగా ప్రసారభారతి ముందుకు సాగుతోందని శేఖర్ చెప్పారు.

ప్రభుత్వంలో కూడా డీడీ అండ్ ఎయిర్ కీలక పాత్ర పోషిస్తోందా?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రసార భారతిలో గ్లామర్ ఫేస్ ఉంటే ఎలావుంటుంది? అవసరమేనా?

దీనిపై వ్యక్తిగతంగా స్పందించడం సరికాదన్నారు. ప్రసార భారతి బోర్డ్ నియామకాలను భారత ఉపరాష్ట్రపతి ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఆ కమిటీ నమ్మకాన్ని నిలబెట్టేలా తాము పని చేస్తామని తెలిపారు. ప్రసార భారతిలో అనుభవజ్ఞులైన విజ్ఞానులున్నారని తెలిపారు. వారిని వినియోగించుకుంటామని తెలిపారు.

ప్రైవేట్ టీవీ ఛానళ్లు డీడీని ఎప్పుడో దాటేశాయి. డీడీని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలా?

డీడీ నెట్‌వర్క్ అన్ని ఛానళ్లు అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విస్తరించి ఉన్నాయని, ఇదే తమ బలాన్ని తెలియజేస్తోందన్నారు. ఇంకా క్రియేటివ్‌గా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు.

21వ శతాబ్ద మీడియా సంస్థగా ఆవిర్భవించడానికి ఎంత కాలం పడుతుంది?

దీనిపై మైండ్‌సెట్, సాంప్రదాయ మార్పులపై ప్రభావం ఉంటుందన్నారు. టెక్నాలజీ, పద్ధతుల్లో వస్తున్న మార్పులు ఒకరి తర్వాత ఒకరు అందరూ అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు.

డీడీ అండ్ ఎయిర్ నుంచి 2022 నాటికి మేము ఏమి ఆశించగలం?

'గ్లోరిఫైడ్ వర్షన్స్ ఆఫ్ డీడీ అండ్ ఎయిర్' గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. 2022నాటికి 'గ్లోరి ఆఫ్ డీడీ అండ్ ఎయిర్'.. డీడీ అండ్ ఎయిర్‌లో వచ్చిన మార్పును మీరు త్వరలోనే గుర్తిస్తారని చెప్పుకొచ్చారు శశి శేఖర్. దూరదర్శన్ తన పూర్వ వైభవాన్ని సాధిస్తుందని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shashi Shekhar Vempati was on Friday appointed as the new Chief Executive Officer of the Prasar Bharati Board. Soon after news of the appointment came out, Information and Broadcasting Minister, Venkaiah Naidu took to twitter and said, “Congratulations Sh. Shashi Shekhar Vempati on your appointment as CEO of prasarbharati. Hope PB scales new heights under your leadership.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more