Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీ, పవర్ స్టార్ దెబ్బ: రాష్ట్రపతి రేసులో సుమిత్రా, ఉప రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయడు !

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు దాదాపు ఖరారు అవుతున్న సమయంలో అనూహ్యంగా మరో మహిళ పేరు తెరమీదకు వచ్చింది.

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు దాదాపు ఖరారు అవుతున్న సమయంలో అనూహ్యంగా మరో మహిళ పేరు తెరమీదకు వచ్చింది. ద్రౌపది ముర్ము కంటే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైపు బీజేపీ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని తాజాగా వెలుగు చూసింది.

మహారాష్ట్ర ఆడుపడుచు అయిన సుమిత్రా మాహాజన్ (74) అటల్ బీహారీ వాజపేయి మంత్రి వర్గంలో 2002-04 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. శివసేన, ఎన్సీపీ మద్దతుతో ఆమె 2014లో లోక్ సభ స్పీకర్ అయ్యారు. ఇండోర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆమె ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నిక అయ్యారు.

ఎన్డీఏ వర్సస్ యూపీఏ !

ఎన్డీఏ వర్సస్ యూపీఏ !

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం పూర్తి అవుతున్న సమయంలో కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రతిపక్షాలను ఏకం చేసిన యూపీఏ నాయకులు కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు రోజుకోక పేరు తెరమీదకు వస్తోంది.

సుమిత్రా మహాజన్ పేరు ఖరారు ?

సుమిత్రా మహాజన్ పేరు ఖరారు ?

ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మొదటి స్థానంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉన్నారని వెలుగు చూసింది. అందరితో సత్సంబంధాలు ఉన్న సుమిత్రా మహాజన్ ను రాష్ట్రపతిగా నియమించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆసక్తి చూపిస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.

రేసులో వెంకయ్య నాయకుడు

రేసులో వెంకయ్య నాయకుడు

ఉప రాష్ట్రపతి రేసులో కేంద్ర మంత్రి ముప్పరపు వెంకయ్యనాయడు పేరు ఖరారు చేశారని తెలిసింది. దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరించడానికి ప్రధాన కారణం అయిన వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టాలని ఢిల్లీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

ఉరకలేస్తున్న బీజేపీ

ఉరకలేస్తున్న బీజేపీ

దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావాలని ఉరకలేస్తున్న బీజేపీ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయడిని నియమించి తాము అనుకున్నది సాధించవచ్చని భావిస్తున్నారని తెలిసింది. వెంకయ్యనాయుడి సహాయంతోనే దక్షిణ భారతదేశంలో బీజేపీని విస్తరించాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారని సమాచారం.

రజనీకాంత్ దెబ్బ కూడా ఓ కారణం !

రజనీకాంత్ దెబ్బ కూడా ఓ కారణం !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అనేక మంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు పిలుపునిచ్చారు. ఈ సందర్బంలో ఉప రాష్ట్రపతి పదవి దక్షిణ భారతదేశానికి చెందిన వెంకయ్యనాయడికి కట్టబెట్టాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ లు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ లు !

దక్షిణ భారతదేశం అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా కేంద్రంలోని పెద్దలకు చిన్నచూపు ఉందని, పదేపదే దక్షిణ భారతదేశ సంసృతి పట్లు చిన్నచూపు చూపిస్తున్నారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనేక సార్లు విమర్శించారు. జల్లికట్టుకు ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చే సందర్బంలో పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. ఈ దెబ్బతో మాకు దక్షిణ భారతదేశం, ఉత్దర భారతదేశం అనే తేడా లేదని చాటి చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడిని తెరమీదకు తీసుకు వచ్చారని సమాచారం.

యూపీఏలో లోల్లి

యూపీఏలో లోల్లి

బీజేపీ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఎల్ కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, ద్రౌపది ముర్ము, రజనీకాంత్, ఉమా భారతీ పేర్తు తెరమీదకు వచ్చి చివరికి సుమిత్రా మహాజన్ పేరు దగ్గర ఆగింది. ఇక యూపీఏ అందరినీ కలుపుకుని మహాత్మగాంధీ మునిమనుమడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు తెర మీదకు తీసుకు వచ్చారు. మొత్తం మీద బీజేపీ నాయకులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఎవరిని పోటీలో నిలుపుతారో అంటూ ఇప్పుడు పెద్ద చర్చ మొదలైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+