జియోకు షాక్... రూ.299కే డీటెల్ ఫోన్!
రిలయన్స్ జియోకు షాక్ ఇస్తూ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్ రానుంది.కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్ అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎ
న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికాం రంగమే కుదేలైంది. ఇటీవల జియో వినియోగదారులందరికి ఉచితంగా 4జి ఫోన్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రిలయన్స్ జియోకు షాక్ ఇస్తూ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్ రానుంది.
కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్ అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.

రిలయన్స్ అధినేత జియో ఫోన్‌ను ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా ప్రకటించారు. అయితే ఇది మాత్రం స్మార్ట్ ఫోన్ కాదు. ఇండియాలో తయారైన ఫీచర్ ఫోన్ ఇది. ప్రముఖ గాడ్జెట్స్ విశ్లేషకుడు రాజీవ్ మఖ్నీ కూడా ఈ ఫోన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రూ.299కే లభించే డీటెల్ డీ1 ఫోన్ లో ఉండే ఫీచర్స్ ఇవీ...
1.44 మోనో క్రోమ్ డిస్ ప్లే, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ సిమ్‌కార్డు, టార్చ్‌లైట్, ఎఫ్‌ఎం రేడియో, స్పీకర్, వైబ్రేషన్ మోడ్‌లు ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ మొబైల్ ఫోన్ ను కొనాలనుకుంటే http://detel-india.com/ కు వెళ్లాల్సిందే.












Click it and Unblock the Notifications