ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా: హ్యాపీ మెమోరీస్ అంటూ రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం నోటీసులు జారీ అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాహుల్ ఆ నోటీసులపై స్పందించారు. ఆ నోటీసులకు కట్టుబడి తాను ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు రాహుల్.
ఈ మేరకు పార్లమెంట్ సెక్రటరీకి రాహుల్ లేఖ రాశారు. ఏప్రిలో 23లోగా తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి సోమవారం నోటీసులు అందాయి. ఈ క్రమంలోను తాను ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

'గత నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన సభ్యునిగా, నేను ఇక్కడ గడిపిన ఆనందకరమైన జ్ఞాపకాలకు ప్రజల ఆదేశానికి రుణపడి ఉన్నాను' అని రాహుల్ గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
'నా హక్కులకు భంగం కలగకుండా, నేను మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను' అని రాహుల్ చెప్పారు. కాగా, 2004లో ఎంపీగా అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ 2005 నుంచి ఈ బంగ్లాలో ఉంటున్నారు.
"మోడీ ఇంటిపేరు" వ్యాఖ్యలతో ముడిపడి ఉన్న నాలుగేళ్ల పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. పై కోర్టులో అప్పీలుకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఒక రోజు తర్వాత, శుక్రవారం ఆయనపై అనర్హత వేటు పడింది.
Congress leader Rahul Gandhi writes to LS Sect over cancellation of Govt accommodation pic.twitter.com/wuhxiUx5hO
— Arvind Gunasekar (@arvindgunasekar) March 28, 2023
'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తేదీ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం లోక్‌సభ సభ్యునిగా (ఎంపీ) అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. కాగా, కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో 2019లో చేసిన 'మోడీ ఇంటిపేరు'పై అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది' అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసును సూరత్ వెస్ట్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేశారు. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది. దీంతో కాంగ్రెస్ తోపాటు దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనలు చేపట్టాయి. పార్లమెంటులోనూ ఆందోళన కొనసాగిస్తున్నాయి. దీంతో బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. రాహుల్ గాంధీ.. వెనకబడిన ప్రజలను, రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు. విదేశాల్లో దేశాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications