వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీవీ ప్యాట్ స్లిప్ లు 50 శాతం లెక్కిస్తారా, లేదా ? ఈసిని ప్రశ్నించిన సుప్రిం

|
Google Oneindia TeluguNews

ఈవిఎమ్ ల ద్వార జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పై పలు అనుమానాలతో పాటు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం మేర వీవీప్యాట్ లను లెక్కించే విధంగా ఈసికి అదేశాలు ఇవ్వాలని కోరుతూ 21 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్లపై సుప్రిం కోర్టు విచారణ చేపట్టింది. వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపును పెంచడంలో ఈసికి, ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలియజేయాలని సుప్రింకోర్టు ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ ధాఖలు చేయాలని స్పష్టం చేసింది.

వీవీప్యాట్ లెక్కింపుపై అఫిడవిట్ ధాఖలు చేయండి

వీవీప్యాట్ లెక్కింపుపై అఫిడవిట్ ధాఖలు చేయండి

ఈ నేపథ్యంలోనే వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒకవేళ పెంచకపోతే స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ మార్చి 28 సాయంత్రం లోగా అఫిడవిట్‌ దాఖలు చేయండి అని సుప్రీంకోర్టు పేర్కోంది. ప్రస్తుత విధానంతో ఎన్నికల కమీషన్ సంతృప్తిగా ఉంటే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని చెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది.

ఒక అసెంబ్లి ఒక ఈవీఎం మాత్రమే లెక్కింపు

ఒక అసెంబ్లి ఒక ఈవీఎం మాత్రమే లెక్కింపు

గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కొత్తగా వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టారు. తాము వేస్తున్న ఓటు ఎవ్వరికి పడుతుందో సరిచూసుకునే విధానం దీని ద్వార కల్పించారు.దీంతోపాటు ఈవిఎమ్ మిషన్లలో ఏదైన తప్పులు జరిగినప్పుడు ,వీవీ ప్యాట్ లను లెక్కిస్తారు.ఈనేపథ్యంలో ఒక అసెంబ్లి నియోజకవర్గంలో ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్ స్లిప్పులతో లెక్కించి సరి చూస్తున్నారు.

స్లిప్ లెక్కింపు సంఖ్యను ఎందుకు పెంచలేకపోతున్నారు

స్లిప్ లెక్కింపు సంఖ్యను ఎందుకు పెంచలేకపోతున్నారు

కాగా తాజాగా సుప్రింకు వెళ్లిన పార్టీలు ఒక అసెంబ్లి నియోజకవర్గానికి ఒక ఈవీఎం కాకుండా వాటి సంఖ్యను పెంచాలని సుప్రింకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు.దీంతో ఇదే అంశంపై విచారణ చేపట్టిన సుప్రిం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు సంఖ్యను ఎందుకు పెంచలేకపోతున్నాంటూ ప్రశ్నించింది. ప్రత్యేక కారణాల వల్లే లెక్కించలేకపోతున్నాం ,ఈసి తరఫున హైజరైన సుదీప్ జైన్ తెలిపారు.అయితే ఇదే సమాధనంతో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రిం కోర్టు ఈసిని ఆదేశించి.

ఈసి స్పందించకపోవడంతో కోర్టుకు వెళ్లిన 21 పార్టీలు,

ఈసి స్పందించకపోవడంతో కోర్టుకు వెళ్లిన 21 పార్టీలు,

ఈ అంశంపై ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపి అధ్యక్షుడు శరద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుండి గులాంనబీ అజాద్, పీడీపి నుండి ఓమర్ అబ్దుల్లా,ఎస్పి,బిఎస్పి, నేతల నేతృత్వంలోని గతంలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించాయి. అయితే దీనిపై ఈసి పెద్దగా స్పందించకపోవడంతో అన్ని పార్టీలు కలిసి సుప్రిం కోర్టును ఆశ్రయించాయి

English summary
The Supreme Court today ordered the Election Commission of India to file an affidavit setting out reasons as to why it is not in favour of physical verification of VVPAT paper trail for more than one polling station per assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X