మోడీ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది: వసుంధర రాజే
జైపూర్: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో తమ విజయానికి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని బిజెపి నేత వసుంధర రాజే సింధియా అన్నారు. కాంగ్రెసు పాలనతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని ఆమె అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అనుసరించడానికి అవసమైన ఆదర్శ నేతగా మోడీ నిలిచారని ఆయన అన్నారు.
రాజస్థాన్ ప్రజలు స్వాభినమంతో ఓటేశారని ఆమె అన్నారు. ఈ విజయాన్ని తాను ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం దిశగా సాగిపోతోందని ఆమె అన్నారు. సెమీ ఫైనల్‌లో వచ్చిన ఫలితాలే ఫైనల్‌లోనూ వస్తాయని ఆమె అన్నారు. తాను 9 నెలల నుంచి ప్రజల్లోనే ఉన్నానని ఆమె అన్నారు.

రాజస్థాన్‌లో విజయాన్ని బిజెపి ఖాయం చేసుకుంది. అయితే, తమ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిపైనే ప్రచారం చేసిందని, అభివృద్ధిని చూపి విజయాన్ని అందుకోవాలని చూశామని కాంగ్రెసు నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. బిజెపి శుష్క వాగ్దానాలతో మభ్యపెట్టిందని, దాంతో తాము పరాజయం పాలయ్యామని ఆయన మీడియాతో అన్నారు.
రాజస్థాన్‌లో బిజెపి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జైపూర్‌ని వసుంధర రాజే నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుని ఆమెకు మిఠాయిలు తినిపించారు. బాణసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications