వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ అస్సాం గెలిస్తే ఏముంది ? బెంగాల్‌ కొడితేనే -ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు తప్పవని తేలిపోతోంది. అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీకి విజయవకాశాలు కనిపిస్తుండగా.. బెంగాల్‌, తమిళనాడు, కేరళలో విపక్షాలు సత్తా చూపబోతున్నాయి. దీంతో ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీ తన భవిష్యత్‌ రాజకీయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ ఫలితాలు కచ్చితంగా ఉపయోగపడతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంచనాలివే...

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంచనాలివే...

వచ్చేనెలలో పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిపై ఇప్పటికే పలు సర్వే సంస్ధలు, రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణలు సాగిస్తున్నారు. వీటి ప్రకారం చూస్తే అస్సాంలో మాత్రమే బీజేపీకి స్పష్టమైన విజయం దక్కేలా కనిపిస్తోంది. పుదుచ్చేరిలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళలో విపక్షాల విజయం ఖాయంగా తెలుస్తోంది. బెంగాల్లో గట్టి పోటీ ఇవ్వడం మినహా బీజేపీ చేసేదేమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 దేశ రాజకీయాల్ని నిర్దేశించే ఫలితాలు

దేశ రాజకీయాల్ని నిర్దేశించే ఫలితాలు


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కరోనా తర్వాత ప్రభుత్వాలతో పాటు ప్రజల ఆదాయాలు కూడా పడిపోయిన పరిస్ధితుల్లో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణల జోరు జనాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో సైతం ఏ రాష్ట్రానికీ కచ్చితంగా న్యాయం చేసినట్లు కనిపించని పరిస్ధితి. దీంతో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆ ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో మమతను అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నబీజేపీకి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే శాపంగా మారినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు దేశ రాజకీయాల్ని కచ్చితంగా నిర్దేశించబోతున్నాయి.

 అసోంలో గెలిస్తే చాలా ? బెంగాల్‌ను కొడితేనే మజా..

అసోంలో గెలిస్తే చాలా ? బెంగాల్‌ను కొడితేనే మజా..

ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పగలిగిన రాష్ట్రం అస్సాం మాత్రమే. ఇక్కడ మినహా మరే చోట కూడా బీజేపీ విజయావకాశాలపై చర్చ జరగడం లేదు. ఆయా చోట్ల ప్రత్యర్దుల్ని అడ్డుకునేందుకు శ్రమించడం మినహా బీజేపీ చేయగలిగింది కూడా ఏమీ లేదు. పుదుచ్చేరిలో అతికష్టం మీద ప్రభుత్వ ఏర్పాటు చేయగలితే గొప్ప. బెంగాల్‌లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి గట్టి విపక్షఁగా నిలిచే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడులో అయితే సింగిల్‌ డిజిట్ సాధిస్తే గొప్ప అన్నట్లుగా ఉంది బీజేపీ పరిస్ధితి. దీంతో ఇప్పుడు దేశంలో బీజేపీ అస్సోం గెలిస్తే చాలదు బెంగాల్‌ కొడితేనే కదా మజా అనే వాదన వినిపిస్తోంది.

హింస, మతం అజెండాగా బెంగాల్‌ ఎన్నికలు

హింస, మతం అజెండాగా బెంగాల్‌ ఎన్నికలు

ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ కూడా ఒకటి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీలోకి అత్యధిక ఫిరాయింపులు జరిగిన రాష్ట్రం కూడా ఇదే. అయినా బీజేపీ పరిస్దితి మాత్రం ఏమీ బాగోలేదు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు చేస్తున్న దాడులే ఇక్కడ ఆ పార్టీకి సానుభూతి వచ్చేలా చేస్తున్నాయి. దీంతో మమత ఈ ఎన్నికల్లో ఒకేసారి బాధితురాలిగా, ఫైటర్‌గా రెండు వేర్వేరు ఇమేజ్‌లను సొంతం చేసుకుంటున్నారు. మత ప్రాతిపదికన ఓట్లు చీల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు మమతకు ఉన్న ముస్లిం, ఇతర మైనార్టీ ఓటు బ్యాంకు అడ్డుకట్ట వేస్తోంది. దీంతో బీహార్‌లో ప్రభావం చూపిన ఓవైసీ పార్టీ ఎంఐఎం ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. గతంలో బీజేపీ బీ టీమ్‌గా ప్రత్యర్ధుల విమర్శలు ఎదుర్కొన్న ఎంఐఎం ప్రభావం లేకపోవడం అంటే అది అంతిమంగా బీజేపీకి నష్టమేనన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.

English summary
the assembly elections in four states and one Union Territory will in all likelihood produce a mixed result and largely influence the future course of Indian politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X