పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు: డిసెంబర్ 15 నుంచి..
గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు.. అంటే, డిసెంబర్ 15 నుంచి జనవరి 5వరకు సమావేశాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. పార్లమెంట్ వ్యవహారల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ఈ విషయాన్ని మీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సమావేశాలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ సమావేశాల నిర్ణయంపై పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది.

గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు.. అంటే, డిసెంబర్ 15 నుంచి జనవరి 5వరకు సమావేశాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. పార్లమెంట్ వ్యవహారల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని అనంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశాల్లో కీలక బిల్లులైన తలాక్, నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్‌సీబీసీ) సభ ముందుకు రానున్నాయని, ప్రజా సంక్షేమం కోణంలో ప్రతిపక్షాలు వీటిని చూడాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదా వేశారన్న విమర్శను ఆయన తోసిపుచ్చారు. గతంలో కాంగ్రెస్ చేసిందేంటి? అని ప్రశ్నించారు. కాగా, ఈ సమావేశాల్లో అప్పులకు సంబంధించిన దివాలా చట్టం, భారత అటవీ సవరణ చట్టం ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications