వింటర్ లో నార్త్​ ఇండియా టూర్‌.. బెస్ట్ ప్లేసెస్ ఇవే..!

చాలామంది నార్త్ ఇండియా టూర్ అంటే ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో అయితే ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఉత్తర భారత్ లోని అనేక ప్రాంతాలు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాలు, అడవులు, ఎత్తయిన కొండలు, పర్వత శిఖరాలు, నదులు, జలపాతాలు, వ్యాలీలకు ఈ ప్రాంతాలు ప్రసిద్ధి గాంచాయి. అలాగే నార్త్ ఇండియాలో ప్రముఖమైన దేవ స్థానాలు కూడా ఉన్నాయి. మరి శీతాకాలంలో నార్త్ ఇండియాలో సందర్శించగలిగే ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి..?

శీతాకాలంలో ఉత్తర భారత్ లో టూర్ హాయిగా ఉంటుంది. చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చటి ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. మరి ఈ సమయంలో సందర్శించాల్సిన ప్రదేశాలను ఓ సారి చూస్తే.. దేశ రాజధాని దిల్లీ.. దిల్లీలో అనేక చారిత్రక కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఈ నగరం యమునా నది ఒడ్డున ఉంది. దిల్లో చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎర్రకోట, కుతుబ్ మినార్, ఇండియా గేట్, లోధి గార్డెన్స్, హుమాయున్ సమాధి, లోటస్ టెంపుల్, పురానా ఖిలా, జామా మసీదు.. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి.

ఇక పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. పవిత్రమైన ఈ ఆలయం దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటిగా ఉంది. ఈ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పర్యటకులు విచ్చేస్తుంటారు. గోల్డెన్ టెంపుల్ తోపాటుగా పంజాబ్ స్టేట్ వార్ మెమోరియల్ మ్యూజియం, జలియన్ వాలా బాగ్, వాల్మికీ తీర్థ స్థల్, వాఘా బోర్డర్ చూడదగిన ప్రదేశాలు.

భారత్ లో జమ్మూ కాశ్మీర్ పర్యాటక స్థలం ముఖ్యమైనదిగా చెబుతారు. ఇక్కడి ప్రకృతి, గొప్ప రాజభవనాలు, కోటలు, దేవాలయాలకు కాశ్మీర్ నిలయంగా ఉంటుంది. కాశ్మీర్ లో ఎటు చూసినా పచ్చని అడవులు, ఎత్తయిన పర్వతాలతో చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కాశ్మీర్ ను సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారు. ఇక్కడే మాతా వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా ఉంది.

ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్.. హిందువులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ పవిత్ర స్థలానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. గంగా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరంలో అనేక చారిత్రక ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతంలో చూడదగిన ప్రదేశాలుగా చండీదేవి ఆలయం, మానసా దేవి ఆలయం, భారత్ మాతా ఆలయం ఉన్నాయి.

Winter Wonderland Delhi to Kashmir via Golden Temple amp amp Holy Haridwar

అలాగే హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో వారణాసి ఒకటిగా నిలుస్తోంది. వారణాసి ప్రాంతంలో అనేక హిందూ దేవాలయాలు, వందల సంఖ్యలో ఘాట్‌ లు ఉన్నాయి. ఇక్కడకు లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ నగరం చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+