విప్రో ఉద్యోగులకు ఛైర్మన్ లేఖ: కంపెనీ అమ్మకం నిజమేనా? ఆయనేమన్నారు!..
మీడియాలో వస్తున్న వార్తలన్ని నిరాధారమైనవని అన్నారు. వదంతులను నమ్మవద్దని ఉద్యోగులకు సూచించారు.
ముంబై: ఐటీ దిగ్గజం విప్రోను అమ్మేయబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని, ఇది హానికరమైనదంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన విప్రో సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు.
లేఖలో సంస్థ ఎదిగిన తీరు గురించి.. భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆయన వివరించారు. గడిచిన 50ఏళ్ల ప్రస్థానంలో కూరగాయలు, నూనెల వ్యాపారంతో విప్రో ఒక ప్రాంతీయ సంస్థగా ఎదిగిందని, నేడు టెక్నాలజీలో ప్రపంచస్థాయిలో మేటి సంస్థగా ముందుకెళ్తోందని గుర్తుచేశారు.

కంపెనీలో ఖాతాదారుల విజయానికి అలాగే కంపెనీ విజయానికి ఎంతో శక్తివంతమైన చరిత్ర ఉందని, దీనికి ఎప్పటిలాగే విప్రో యాజమాన్యం కట్టుబడి ఉంటుందని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలన్ని నిరాధారమైనవని అన్నారు. వదంతులను నమ్మవద్దని ఉద్యోగులకు సూచించారు. ప్రేమ్‌జీ వివరణతో.. విప్రోలో ఆయన వాటాల అమ్మకంపై జరుగుతున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications