షాక్: విప్రోలో600 మంది టెక్కీలపై వేటు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశంలోనే మూడవ అతి పెద్దదైన సాఫ్ట్ వేర్ సేవల సంస్థ విప్రో కూడ ఉద్యోగులను ఇంటికి పంపనుంది. వార్షిక పనితీరు అంచనాలో భాగంగా వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది.

సుమారు 600 మందిని ఇంటికి పంపించనుంది. అయితే ఈ సంఖ్యను మరింత పెరగనుందనే ఊహగానాలు వస్తున్నాయియ. ఈ సంఖ్య 2 వేల మంది కంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని సమాచారం.

wipro

అయితే దీనిపై స్పందించిన విప్రో రెగ్యులర్ ప్రాసెస్ భాగంగానే ఈ తొలగింపును చేపట్టినట్టు ప్రకటించింది. తన క్లయింట్ రిక్వైర్ మెంట్స్ ను, సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగులను క్రమబద్దీకరించే క్రమంలో కఠినమైన పనితీరును అంచనా వేసే ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపింది.

సమగ్రమైన పనితీరు అంచనా ప్రక్రియలో ఉద్యోగుల మార్గదర్శకత్వం, పున:శిక్షణ, ఆప్ స్కిల్లింగ్ కూడ ఉంటుందని తేల్చి చెప్పింది. అలాగే సంస్థ నుండి కొందరు ఉద్యోగులపై వేటుకు దారితీసే అవకాశం కూడ ఉందని తెలిపింది.అయితే ఈ సంఖ్య సంవత్సరాంతానికి మారుతూ ఉంటుంది.

అయితే ఎంతమందిని తొలగించేది ఇంకా స్పష్టం చేయలేదు. డిసెంబర్ 2016 నాటికి బెంగుళూరుకు చెందిన కంపెనీకి 1.79 లక్ష ఉద్యోగులున్నారు. ఏప్రిల్ 25న, నాలుగో త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The country's third largest software services firm Wipro is learnt to have fired hundreds of employees as part of its annual "performance appraisal".
Please Wait while comments are loading...