దటీజ్ కానిస్టేబుల్ స్మిత: ఆమె ఫాలోవర్స్ 7 లక్షల మంది
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ స్మిత. ఆమెకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఖాతాను ప్రారంభించిన ఇరవై నెలల్లోనే ఏడు లక్షల మంది ఆమెను ఫాలో కావడం గమనార్హం. అందుకు కారణం ఉంది.
ఆమె సాయం చేయడంలో ముందు నిలుస్తోంది. బిలాయ్‌కు చెందిన దినేష్ అనే ఆటో రిక్షా డ్రైవర్ కూతురు క్యాన్సర్ బారిన పడింది. ఆమె బతకదని వైద్యులు చెప్పారు. తండ్రి ఈ కానిస్టేబుల్ స్మిత సాయం కోరాడు. స్పందించిన స్మిత ఫేస్‌బుక్ ద్వారా సాయం చేయాలని కోరింది.

ఆమె పోస్టుకు స్పందించిన దాతలు ఆర్థిక సాయం చేశారు. దినేష్ కూతురు ఢిల్లలో కోలుకుంటోంది. స్మిత ఇలా చాలామందికి వైద్య సాయం అందించింది. ఈమె అయిదేళ్ల క్రితం పోలీస్ ఉద్యోగంలో చేరారు. పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో పేస్ బుక్ ఖాతా తెరిచారు.
ఆమె ఎదుర్కొన్న ఓ సంఘటనే ఈ ఖాతా తెరిచేందుకు దోహదపడింది. మూడేళ్ల క్రితం పోలీస్ శిక్షణకోసం వెళ్లిన సమయంలో తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయనకు వైద్యం చేయించడానికి తన వద్ద డబ్బుల్లేవి, ఓ ప్రయివేటు ఆసుపత్రిలో తన తండ్రి తుది శ్వాస విడిచారని, అప్పుడే పేదలకు వైద్య సాయం విషయంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తన ఫేస్ బుక్ ద్వారా సమస్య తెలుసుకొని చాలామంది వివరాలు ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications