మోడీ ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా 'అమెరికా ఎన్నిక' ఊసులేదు!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల చలామణి రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న నిర్ణయం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చారిత్రక నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ అంశం ఇప్పుడు గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ట్రెండింగ్‌గా మారింది. ప్రధాని తీసుకొన్న నిర్ణయంతో గూగుల్ ట్రెండ్స్‌లో అమెరికా ఎన్నికల అంశం జాడే లేకుండా పోయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇండియా న్యూస్, మోడీ, 2000 ఆర్‌ఎస్ నోట్, 500 ఆర్‌ఎస్ నోట్, 2000 రూపీస్ నోట్ ఇండియా, ఇండియా కరెన్సీ, పీఎం మోడీ స్పీచ్, మోడీ స్పీచ్ లైవ్, బ్యాంక్ నోట్ వంటి పేర్లతో విపరీతమైన సెర్చ్ జరుగుతోంది. మోడీ ప్రసంగ ప్రారంభంలో 5-10 శాతం ఉన్న ఆసక్తి క్షణాల్లోనే 100 శాతంగా మారిపోయింది.

ఇదిలా ఉండగా, మోడీ చేసిన ఒక్క ప్రకటనతో మొత్తం సీను మారిపోయింది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు జేబుల్లో రూ.500, రూ.1000 నోట్లు పెట్టుకున్న వారికి కొద్దిసేపటిలో తమ నోట్లు చిత్తు కాగితాలుగా మారబోతున్నాయన్న సంగతి తెలిసి షాక్ తిన్నారు.
ఎలాగో తేరుకుని జేబుల్లోంచి డబ్బులు తీసి 100, 50, 20, 10 నోట్లు ఉన్నాయో లేవో చూసుకున్నారు. 500 నోట్లు, 1000 నోట్లు అర్థరాత్రి నుంచి మాత్రమే చెల్లవని (కొన్ని చోట్ల మినహా) ప్రధాని ప్రకటించినప్పటికీ, ఆయన మాటను తక్షణం అమలులో పెట్టిన పెట్రోలు బంకులు, పలు దుకాణాల నిర్వాహకులు అప్పటికప్పుడే ఈ నోట్లను పనికిరానివిగా పరిగణించి ఖాతాదారులకు దిమ్మతిరిగేలా చేశారు.
ఆ క్షణాన జేబులో కనీసం 100, 50, 20, 10 నోట్లున్నవాళ్లు తల పైకెత్తుకుని గర్వంగా నిలబడ్డారు. వీటిలో 100 నోటే పెద్దది కాబట్టి ఆ నోట్లున్నవాళ్ళు అప్పుడు కింగ్‌లు! కేవలం క్షణాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పుడు ఇదే చర్చ.












Click it and Unblock the Notifications