రూ. 500, 1000 నోట్లు చిత్తు కాగితాలే: ఏం చేయాలి?
న్యూఢిల్లీ: ఈ అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ నుంచి నకిలీ ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు దేశంలోకి రవాణా అయి చెలామణి అవుతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.
ఈ స్థితిలో మనం ఏం చేయాలనే విషయాలను ఈ కింద ఇవ్వడం జరిగింది. రూ.500, 1000 నోట్లను ఈ కింది రకంగా మనం చేయాల్సి ఉంటుంది.

- ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1,000 నోట్ల చెలామణిని రద్దు చేస్తారు
- రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో జమ చేయాలి
- రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెడుతుంది.
- గడువు లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో జమ చేయలేనివారు రిజర్వ్ బ్యాంక్‌లో డిక్లరేషన్ ఇచ్చి సమర్పించవచ్చు.
- వచ్చే 72 గంటల పాటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చెల్లే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- నవంబర్ 9వ తేదీన అన్ని బ్యాంకులను మూసేస్తారు
- రూ.500, రూ.2,000 నోట్ల జారీకి రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రతిపాదనలకు అంగీకారం












Click it and Unblock the Notifications