ఆరు మంది ఎమ్మెల్యేలు జారుకుంటే పళనిసామి ఔట్, పన్నీర్ కే !
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 231 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గోంటున్నారు. ఎడప్పాడి పళనిసామికి 116 ఓట్లు వస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో 116 మంది ఎవరివైపు ఉంటే వారే సీఎం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంత వరకు శశికళ వర్గంలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు.
శనివారం ఉదయం వరకు శశికళ వర్గంలో ఉన్న కోయంబత్తూరు నార్త్ నియోజక వర్గం ఎమ్మెల్యే అరుణ్ కుమార్ అక్కడి నుంచి జారుకుని పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.

ఇక కేవలం ఆరు మంది ఎమ్మెల్యేలు జారుకుంటే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇలా ఉంటే అసెంబ్లీలో బలపరిక్షలో ఎవరికి 116 ఓట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. జయలలిత మరణంతో ఓ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. డీఎంకే చీఫ్ కరుణానిధి అనారోగ్య కారణంగా బలపరిక్షలో జరిగే ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. స్పీకర్ ధనపాల్ ఎవ్వరికీ ఓటు వెయ్యకుండా తటస్థంగా ఉన్నారు.
మొత్తం 231 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గోంటున్నారు. ఎడప్పాడి పళనిసామికి 116 ఓట్లు వస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు. లేదంటే ఆయన ప్రభుత్వం ఇంటికే. ఆ సమయంలో డీఎంకే మద్దతు ఇస్తే పన్నీర్ సీఎం అయ్యే చాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications