వివాహలకు ఇచ్చినట్టుగానే అంత్యక్రియలకు కూడ సడలింపులు ఇవ్వాలి

వివాహం కోసం 2.5 లక్షల నగదును ఏ రకంగా ఒకేసారి డ్రా చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారో, అంత్యక్రియల నిర్వహణకు కూడ అంతే మొత్తాన్ని డ్రా చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని డిల్లీకి చెందిన అమర్ నాథ్ అగర్వాల్

న్యూడిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం వివాహలపైనే కాదు అంత్యక్రియలపై కూడ పడింది. అంత్యక్రియలు చేసేందుకు తనకు కూడ రెండున్నర లక్షల రూపాయాలను బ్యాంకు నుండి డ్రా చేసుకొనేందుకు ఇవ్వాలని డిఆర్ డి ఓ శాస్త్రవేత్త ఫ్రోఫెసర్ అమర్ నాథ్ అగర్వాల్ బ్యాంకు అధికారులను కోరుతున్నారు. అయితే నిబంధనలు ఒప్పుకోవని బ్యాంకు అధికారులు తేల్చేశారు.

పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో పెళ్ళిళ్ళతో పాటు చావులపై కూడ ఉంది. వివాహల కోసం రెండున్నర లక్షల నగదును డ్రా చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే అంత్యక్రియల నిర్వహణ కోసం కూడ నిబంధనలను సడలించాలని అమర్ నాథ్ కోరుతున్నాడు.

 withdraw money from banks relaxation for cremation

న్యూడిల్లీలోని కంజూరుమా ర్గ్ కు చెందిన అమర్ నాథ్ అగర్వాల్ సతీమణి ద్రౌపది ఈ నెల 19, తేదిన చనిపోయింది. పెద్ద నగదు నోట్ల రద్దు ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. తన భార్య అంత్యక్రియల నిర్వహణ కోసం ఆయనకు సుమారు రెండున్నర లక్షలు ఖర్చు అవుతోంది. బ్యాంకులో ఉన్న డబ్బును ఎలా మార్చుకోవాలో ఆయన అర్థం కాలేదు.

తన భార్య అంత్యక్రియల అవసరం కోసం రెండున్నర లక్షలను డ్రా చేసుకొనే అవకాశం కల్పించాలని కెనరా బ్యాంకు అధికారులను కోరాడు. అయితే బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. నిబంధనలు ఒప్పుకోవని తేల్చేశారు.తన రెండు బ్యాంకు ఖాతాల నుండి 40 వేల రూపాయాలను డ్రా చేశాడు.అంత్యక్రియల నిర్వహణ కోసం కూడ నగదు ఉపసంహరణకు సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+