మహిళను బలవంతంగా రైలు దింపి ఆపై ఆరుగురు రేప్
దియోగఢ్: రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జార్ఖండ్ రాష్ట్రం దేవ్‌గఢ్ జిల్లాలోని మధుపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వివాహిత (25) తన తండ్రితో కలిసి గురువారం గిరిద్-మధుపూర్ పాసింజర్ రైలులో ప్రయాణిస్తోంది. రైలులో ఆమె తండ్రి నిద్రపోతున్న సమయంలో మధుపూర్ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే దుండగులు ఆమెను బలవంతంగా రైలు నుంచి కిందికి దింపారు.

అనంతరం సమీప ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రైల్వే ఎస్పీ అసీమ్ విక్రాంత్ మింజ్ తెలిపారు. మెలకువ వచ్చి చూసిన తండ్రికి కుమార్తె కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్ చుట్టపక్కల పరిసర ప్రాంతాల్లో గాలించారు.
చివరికి ఆమె దంగల్ పురా ప్రాంతంలో అపస్మారకస్థితిలో కనిపించింది. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో కూతురు కూడా నిద్రలో ఉన్నట్లు ఫిర్యాదులో ఆమె తండ్రి పేర్కొన్నాడు. మహిళపై అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని రైల్వే ఎస్పీ అసీం విక్రాంత్ మింజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications