గన్ గురి పెట్టి గ్యాంగ్ రేప్ చేసిన పోలీసులు
లక్నో: కేసు విషయంలో మాట్లాడాలని పిలిపించిన పోలీసులు మహిళను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని శహరాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.
బాధితురాలి కథనం మేరకు - ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాధితురాలి భర్త మీద పోలీసులు ఓ తప్పుడు కేసు నమోదు చేశారు. ఆగస్టు 1వ తేదిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఈ విషయంపై మాట్లాడటానికి రావాలని ఆమెకు పోలీసులు చెప్పారు. ఆగస్టు 6వ తేదిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఆ సందర్బంలో అక్కడ ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను దూషించాడు.

తరువాత సబ్ ఇన్స్ పెక్టర్ తో సహా ఇద్దరు కానిస్టేబుల్స్ నుదిటి మీద గన్ గురి పెట్టి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు సీనియర్ పోలీసు అధికారి ఆర్ పీఎస్ యాదవ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పోలీసు అధికారులు సబ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి జగదీష్ శర్మా చెప్పారు. బాధితురాలిని వైద్య పరిక్షలకు తరలించామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications