Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !
అహ్మదాబాద్/ గుజరాత్/ చెన్నై: కట్టుకున్న భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసిన ఆ భార్య భర్తకు తోడుగా ఉంటోంది. మామ చనిపోవడంతో భర్తలో మార్పులు వచ్చాయి. విదేశాల నుంచి భారత్ వచ్చిన తరువాత భర్త భార్యకు ఓ ప్రపోజల్ ముందు పెట్టాడు. మా అన్న వదిన అంటే నాకు చాలా ఇష్టం, నేను మా వదినతో ఎంజాయ్ చేస్తా, నువ్వు మా అన్నతో ఎంజాయ్ చెయ్యి అని చెప్పాడు. నేను మా అన్న భార్యలను మార్చుకోవాలని డిసైడ్ అయ్యాము, మా వదిన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భర్త అతని భార్యకు చెప్పాడు. చాలా కాలం భార్యలను మార్చుకోవాలని ప్లాన్ వేసిన అన్నదమ్ములకు ఇప్పుడు ఓ సీన్ తో సినిమా కనపడుతోంది.

హ్యాపీలైఫ్.... ఉమ్మడి కుటుంబం
గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాట్ లోడియా ఏరియాలో నివాసం ఉంటున్న రాజేష్, గుజరాత్ కు చెందిన అక్షయా రాయ్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే ఇద్దరికి 2008లో వివాహం జరిగింది. రాజేష్ కు సురేష్ అనే అన్న, అతని భార్య రీనా అనే వదిన (పేర్లు మార్చడం జరిగింది) ఉన్నారు. రాజేష్, సురేష్ తల్లిదండ్రులు, వారి భార్యలతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి
రాజేష్ భార్య అక్షయాకు ఇప్పుడు 34 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత రాజేష్ చాలా కాలం ఉద్యోగం లేకుండా ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలో రాజేష్, అక్షయా దంపతులకు అతని అన్న సురేష్ తో పాటు వదిన రీనా ఆర్థిక సహాయం చేసి వారికి అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చారు. 2013లో నైజీరాయాలోని లాగోస్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రాజేష్ కు ఉద్యోగం వచ్చింది.

కాన్ఫు కోసం భారత్ కు భార్య
భర్త రాజేష్ తో పాటు అక్షయా కూడా నైజీరియాకు వెళ్లింది, అక్షయా కూడా అక్కడ ఉద్యోగంలో చేరింది. 2016లో అక్షయా గర్భవతి అయ్యింది. కాన్ఫు కోసం అక్షయా మాత్రమే భారత్ కు వచ్చి అహ్మదాబాద్ లోని అత్తారింటికి వెళ్లింది. ఆ సమయంలో నైజీరియా నుంచి ఫోన్ చేసిన భర్త రాజేష్ తన అన్న సురేష్, వదిన రీనాతో అన్యోన్యంగా ఉండాలని, వాళ్లు నిన్ను బాగా చూసుకుంటారని మాయమాటలు చెప్పాడని తెలిసింది.

నీకు మా అన్న... నాకు మా వదిన.... ఎంజాయ్ చేద్దామా ?
కొంత కాలానికి రాజేష్ తండ్రి మరణించాడు. తరువాత రాజేష్ కూడా భారత్ వచ్చేశాడు. నాకు మా అన్న సురేష్ చాలా సహాయం చేశాడని, అతను నీతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడుతున్నాడని, నువ్వు మా అన్నకు పడక సుఖం ఇవ్వాలని భర్త రాజేష్ చెప్పడంతో అతని భార్య అక్షయా షాక్ అయ్యింది. ఇదే సమయంలో తనకు తన వదిన రీనా అంటే కూడా ఇష్టమని, ఆమెతో నేను ఎంజాయ్ చేస్తానని రాజేష్ చెప్పడంతో అతని భార్య అక్షయాకు మైండ్ బ్లాక్ అయ్యింది.

భార్య రివర్స్ తో టార్చర్
నీకు మతిపోయి మాట్లాడుతున్నావా ?, భార్యలను మార్చుకోవడం ఏమిటి ? అంటూ అక్షయా భర్త రాజేష్ మీద విరుచుకుపడింది. అహ్మదాబాద్ లో కొంతకాలం గొడవలు జరిగిన తరువాత రాజేష్, అక్షయా దంపతులు మళ్లీ నైజీరియా వెళ్లిపోయారు. అక్కడ మళ్లీ అక్షయా రెండోసారి గర్బవతి అయ్యింది. 2017లో మళ్లీ అక్షయా అహ్మదాబాద్ లోని అత్తారింటికి వచ్చింది. 2017 అక్టోబర్ నెలలో అక్షయా మీద పడిన ఆమె బావ సురేష్ తన కోరిక తీర్చాలని టార్చర్ పెట్టాడని బాధితురాలు (అక్షయా) ఆరోపించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.

భార్యను చితకబాదేశాడు
నైజీరియాలో ఉద్యోగం మానేసిన తన భర్త రాజేష్ అహ్మదాబాద్ వచ్చేశాడని, తరువాత తనను అతని అన్న సురేష్ తో పడుకుని పడక సుఖం ఇవ్వాలని టార్చర్ చేశాడని అక్షయా ఆరోపిస్తోంది. ఈ విషయం తన స్నేహితులు, తన భర్త రాజేష్ స్నేహితులకు చెప్పడంతో వాళ్లు షాక్ అయ్యారని అక్షయా అంటోంది. ఒక పక్క భర్త రాజేష్, బావ సురేష్ టార్చర్ తట్టుకోలేక అక్షయా ఇప్పుడు అహ్మదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

సినిమాల్లో చూశాము... ఇప్పుడు నిజంగా ?
భార్యలను మార్చుకోవాలని ఫ్రెండ్స్ ప్రయత్నించిన సంఘటనలు మేము సినిమాల్లో చూశామని, ఇప్పుడు నిజంగా వింటున్నాము, చూస్తున్నామని పోలీసులు అంటున్నారు. అక్షయా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అహ్మదాబాద్ పోలీసులు ఆమె భర్త రాజేష్, అతని అన్న సురేష్ ను పిలిచి విచారణ చేస్తున్నారు. అక్షయా కొన్ని సాక్షాలు ఇవ్వడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు పిల్లల తల్లిని అన్నకు అప్పగించి వదినతో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించిన రాజేష్ కు షార్వా కారిపోతుందని తెలిసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications