వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతం అడిగితే కన్నెర్రజేశాడు.. యువతిని చితకబాదిన యజమాని (వీడియో)

|
Google Oneindia TeluguNews

నోయిడా : ఉద్యోగిని పట్ల యజమాని క్రూరంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. పని చేయించుకుని జీతం అడిగిన పాపానికి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు ఓనర్. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ఏరియాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

woman beaten in noida for salary demand

స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్న యువతి.. ఆమెకు రావాల్సిన జీతం గురించి యజమానిని అడిగింది. దాంతో కోపోద్రిక్తుడైన ఓనర్ ఆమెను ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నాకే బదులు చెప్తావా అంటూ ఆ యువతిని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ దెబ్బలు తాళలేక ఆమె రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చింది. అయినా కూడా ఆమెను వెంబడిస్తూ కర్రలతో చితకబాదాడు. ఆ యజమానికి సంబంధించిన మరికొందరు తోడయ్యారు. అందరూ కలిసి విచక్షణారహితంగా కొట్టారు. ఒకడైతే మరీ దారుణంగా ఆమె జుట్టును పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లాడు. బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

కరీంనగర్ జిల్లాలో విషాదం.. చిన్నారిని బలిగొన్న ఇసుక మాఫియా..!కరీంనగర్ జిల్లాలో విషాదం.. చిన్నారిని బలిగొన్న ఇసుక మాఫియా..!

రెండు రోజుల కిందట ఘజియాబాద్ లో ఇలాంటి సంఘటనే ఇంకోటి జరిగింది. తన దగ్గర పనిచేసి వెళ్లిపోయిన మహిళా ఉద్యోగి.. జీతం కింద రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలంటూ యజమానిని ప్రశ్నించింది. కోపంతో రగిలిపోయిన ఓనర్ కొడుకు మాకు ఎదురు నిలబడి ప్రశ్నిస్తావా అంటూ ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. దానికి తోడు యజమాని కూడా ఆ యువతిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాళ్లు వెంటనే వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగానే ఆ యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Shocking incident from Greater Noida area where a girl, in a viral video, is seen being beaten up and assaulted by a group of men with stick. Incident is from Knowledge Park Police Station area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X