గ్రామాలలో ఈవీ విప్లవం.. వాటికి 13లక్షల సబ్సిడీ, తెలంగాణా సర్కార్ కీలకనిర్ణయం!

ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈవీ విప్లవం ఇప్పుడు తెలంగాణ గ్రామాలను కూడా తాకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చు తక్కువ రవాణా సౌకర్యాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

8 జిల్లాల్లో 35 చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు

మొదటి దశలో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 35 చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పనున్నారు. వీటిని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి స్టేషన్ నిర్మాణానికి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం PM E-Drive పథకం కింద 13 లక్షల రూపాయల సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన 7 లక్షల రూపాయలు PACSలు తమ సొంత నిధులతో భరించాలి.

Telangana EV charging stations through PACS in all telangana villages to support people for ev revolution

ఛార్జింగ్ సౌకర్యాల కొరత వల్ల EV యజమానులు ఇబ్బంది

ఈ మోడల్ ద్వారా సహకార సంఘాలకు కొత్త ఆదాయ వనరు ఏర్పడనుంది. గత రెండేళ్లలో గ్రామీణ తెలంగాణలో 12,041 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఛార్జింగ్ సౌకర్యాల కొరత వల్ల EV యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి దూరంగా వెళ్తే ఛార్జ్ అయిపోతే తిరిగి రావడం కష్టంగా మారుతోంది.

డిమాండ్ ఎక్కువగా ఉన్న 35 స్థలాల ఎంపిక

ఈ సమస్యను పరిష్కరించేందుకు PACSల వద్ద ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు, గ్రామీణులకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహాయం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి డిమాండ్ ఎక్కువగా ఉన్న 35 స్థలాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఒక్క కిలోవాట్ గంటకు సుమారు రూ.18 చార్జీతో ఛార్జింగ్ అందించనున్నారు.

డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ బస్సు ఛార్జీల భారం.. టీజీఎస్ ఆర్టీసీ చెప్పిందిదే!
డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ బస్సు ఛార్జీల భారం.. టీజీఎస్ ఆర్టీసీ చెప్పిందిదే!

మరిన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక

డిమాండ్ పెరిగే స్థాయిలో మరిన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా ఉంది. ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. దీంతో EV వినియోగదారులకు సౌకర్యం కలుగుతుంది. PACSలు 3-4 సంవత్సరాల్లో తమ పెట్టుబడిని తిరిగి పొంది, అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 908 PACSలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. దశలవారీగా ఈ సంఖ్యను పెంచి ఎక్కువ సంఘాల వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+