'సెక్స్' కోసం బాత్రూమ్ లోకి లాక్కెళ్లింది: 'నో' చెప్పడంతో మర్మాంగాలు కోసేసింది..

రవి మాటలకు యువతి తీవ్ర కోపోద్రిక్తురాలైంది. ఆ వెంటనే అతన్ని బాత్రూమ్ లోకి లాక్కెళ్లి.. తనతో శృంగారం చేయాల్సిందిగా పట్టుబట్టింది.

న్యూఢిల్లీ: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ఓ ప్రియుడి మర్మాంగాలు కోసేసింది యువతి. ఇంటికి పిలిచి మరీ.. పెళ్లి గురించి ప్రస్తావించిన యువతి.. ప్రియుడు అందుకు 'నో' చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఆపై, అతన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి.. తనతో శృంగారం చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అందుకు ప్రియుడు ససేమిరా అనడతో.. కత్తితో అతని మర్మాంగాలను కోసేసింది.

న్యూఢిల్లీ శివారు ప్రాంతమైన మంగోల్ పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగోల్‌పురికి చెందిన చిరు వ్యాపారి రవి(35), ఓ స్థానిక యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బుధవారం ఇంటికి రావాల్సిందిగా ఆమె కోరడంతో.. రవి అక్కడికి వెళ్లాడు. రవితో మాటల మధ్యలో యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో తమ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదని, నీతో పెళ్లి కుదరదని రవి తేల్చి చెప్పాడు.

Woman bobbitises boyfriend for refusing to have sex, marry as family watches

రవి మాటలకు యువతి తీవ్ర కోపోద్రిక్తురాలైంది. ఆ వెంటనే అతన్ని బాత్రూమ్ లోకి లాక్కెళ్లి.. తనతో శృంగారం చేయాల్సిందిగా పట్టుబట్టింది. అందుకు రవి ఒప్పుకోకపోవడంతో.. కూరగాయల కత్తి తీసుకొచ్చి అతని జననాంగాలు కోసేసింది. యువతి ఆ చర్యకు పాల్పడుతున్న సమయంలో.. కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉండటం గమనార్హం.

తనపై దాడి జరిగిన సమయంలో యువతి సోదరుడు, వదిన ఇంట్లోనే ఉన్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారెవరూ యువతిని నిలువరించే ప్రయత్నం చేయలేదని వాపోయాడు. దాడి తర్వాత గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తడంతో.. స్థానికులే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన శస్త్ర చికిత్స కోసం అతన్ని జైపూర్ లోని గోల్డెన్ ఆసుపత్రికి తరలించారు.

నిందితురాలు సహా కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆమెపై సెక్షన్-326కేసు నమోదు చేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+