దారుణం: కట్నం కోసం భార్యను సజీవ దహనం చేశాడు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్నం కోసం ఓ భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యను సజీవ దహనం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఖాన్‌పూర్‌కు చెందిన సోను తన తల్లిదండ్రులు విజయ్ పాల్, మునీశ్ లతో కలిసి తన భార్య కాజల్‌ను కట్నం కోసం వేధింపులకు గురిచేసి సజీవ దహనం చేశాడు. విషయం తెలుసుకున్న కాజల్ తండ్రి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కాజల్‌ని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. నిందితులు కాజల్ భర్త సోను, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Woman burnt alive by husband, in-laws for dowry in UP village

ఎక్సైజ్ అధికారి భార్యాబిడ్డల హత్య

న్యూఢిల్లీ: దక్షిణ న్యూఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో అమానుష ఘటన జరిగింది. ఇద్దరు పసి పిల్లలు సహా, ఓ ఎక్సైజ్ అధికారి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఎక్సైజ్ అధికారి అమిత్ భార్య, ఇద్దరు పిల్లలు తమ నివాసంలో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

మృతులను దీప్ మాలా అలియాస్ దీప(34), కొడుకు సాక్షమ్ (9) రెండేళ్ల పసిపాప షైలీగా గుర్తించామన్నారు. దీప మృతదేహం బెడ్ రూంలో పడివుండగా, ఇద్దరు పసిపిల్లల శవాలు బాత్ రూంలో లభించాయి. వీరిపై పదునైన ఆయుధాలతో దాడిచేసిన ఆనవాళ్లున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సంఘటనా స్థలంలో దొంగతనం జరిగిన ఆనవాళ్లు లేవని వ్యక్తిగత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నేర, ఫోరెన్సిక్ విభాగం ప్రాథమిక వివరాలు సేకరించిందని, హత్యకేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+