ప్రియుడి జల్సాల కోసం పుట్టింట్లో నగలు దోచిన ఓ భార్య

వీరు అగ్రహార దాసరహళ్లిలో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న మధు అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది గుర్తించిన భర్త పద్ధతిని మార్చుకోవాలని భార్యకు నచ్చజెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గత ఏడాది ఆమె కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది.
ఆ సమయంలో ఆమె ప్రియుడు మధు వెళ్లి కలిశాడు. ఖర్చుల కోసం నగదు కావాలని అడిగాడు. దీంతో పుట్టింటిలో ఉన్న బంగారు నగలను ఆమె ప్రియుడికి ఇచ్చింది. ఆ నగలు కుదువపెట్టి వచ్చిన నగదుతో మధు జల్సాలు చేశాడు. కుదువు పెట్టిన నగల చిట్టీని మధు ఆమెకు ఇచ్చాడు.
ఆ పత్రాలను ఆమె ఇంట్లోనే దాచి పెట్టింది. ఇంట్లోని నగలు కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఇంట్లో దొరికిన రసీదులతో... ఇంటి దొంగను పట్టుకున్నారు. పోలీసులు విచారించడంతో ఆమె విషయాన్ని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications