Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lockdown: వెంటాడిన కష్టాలు, భర్త అలా పోతే ఇంటి ఓనర్ టార్చర్, కాఫీలో విషం కలిపి తల్లి, పిల్లలు తాగి !

చెన్నై/ శివగంగై/ మదురై: భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్నకాటికి సంతోషంగా గడుపుతున్న ఓ మహిళకు ఊహించన విధంగా కష్టాలు ఎదురైనాయి. నాలుగు నెలల క్రితం భర్త మరణించడం, లాక్ డౌన్ కారణంగా ఏ పని చెయ్యడానికి అవకాశం లేకపోయింది. ఇదే సమయంలో ఇల్లు ఖాళీ చెయ్యాలని ఇంటి యజమాని, ఆమె సోదరుడు అందరి ముందు ఆమెమీద చెయ్యి చేసుకుని జాకెట్ చంపేశారు. కాఫీలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు ఇచ్చింది. తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

 ఉన్నకాటికి ఈ సంతోషం చాలు

ఉన్నకాటికి ఈ సంతోషం చాలు

తమిళనాడులోని శివగంగై జిల్లా దేవకోటైలోని చిదంబరనాథపురానికి చెందిన రాందాస్ (42), ప్రియదర్శిని ( 36) దంపతులు నివాసం ఉంటున్నారు. రాందాస్, ప్రియదర్శిని దంపతులకు పర్వత వర్దిని (16) అనే కుమార్తె, నీలకంఠన్ (14), జయహరిక్రిష్ణన్ (12) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాందాస్, ప్రియదర్శిని దంపతులు సంపాధిస్తున్న దాంట్లో ఉన్న ఉన్నకాటికి చాలు అంటూ ముగ్గురు పిల్లలతో కలిసి ఇంతకాలం సంతోషంగా గడిపారు.

 వెంటాడిన కష్టాలు

వెంటాడిన కష్టాలు

నాలుగు నెలల క్రితం రాందాస్ అనారోగ్యానికి గురైనాడు. ఆ సమయంలో రాందాస్ కు గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు. అదే సమమంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో ముగ్గురు పిల్లలను పోషించలేక ప్రియదర్శిని నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని వసంతి టార్చర్ ఎక్కువ అయ్యింది.

 తమ్ముడిని రెచ్చొట్టిన వసంతి

తమ్ముడిని రెచ్చొట్టిన వసంతి

ఇల్లు ఖాళీ చేసే విషయంలో ప్రియదర్శిని, వసంతిల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో నువ్వు ఇల్లు ఎలా ఖాళీ చెయ్యవో నేను చూస్తాను అంటూ వసంతి రెచ్చిపోయింది. వసంతి కారైకుడీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె తమ్ముడు రాజేంద్రన్ ను రంగంలోకి దింపించి. ఊరికి వచ్చిన వెంటనే అక్క వసంతికి మద్దతుగా మాట్లాడిన రాజేంద్రన్ రెచ్చిపోయి ఇల్లు ఖాళీ చెయ్యాలని ప్రియదర్శిని మీద దాడి చెయ్యడమే కాకుండా రోడ్డులో ఆమె జాకెట్ చించేశాడు.

 అవమానంతో కాఫీలో విషం కలిపి

అవమానంతో కాఫీలో విషం కలిపి

అందరి ముందు తన మీద దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన చెందిన ప్రియదర్శిని రాత్రి కాఫీలో విషం కలిపి పిల్లలకు ఇచ్చింది. కాఫీలో విషం కలిపిన విషయం తెలీక ప్రియదర్శిని పిల్లలు తాగేశారు. అదే సమయంలో ప్రియదర్శిని విషం కలిపిన కాఫీ తాగడంతో నలుగురు కుప్పకూలిపోయారు.

Recommended Video

    COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
     అనంతలోకాలకు తల్లి, అనాథలైన పిల్లలు

    అనంతలోకాలకు తల్లి, అనాథలైన పిల్లలు

    చుట్టు పక్కల వాళ్లు విషయం గుర్తించి ప్రియదర్శిని, ఆమె ముగ్గురు పిల్లలను దేవకోటై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ప్రియదర్శిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని దేవకోటై పోలీసులు చెప్పారు. వసంతి, ఆమె సోదరుడు రాజేంద్రన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి గుండెపోటుతో మరణించడం, తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో రాందాస్, ప్రియదర్శిని పిల్లలు నేడు అనాథలై ఆసుపత్రిలో సహాయం చేసే దిక్కులేక మృత్యువుతో పోరాడుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+