గెస్ట్ హౌస్‌లో లేడీ కానిస్టేబుల్ మృతి: ప్రియుడి అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం - ఢిల్లీలోని సాగర్ పూర్ ప్రాంతంలో గల నీల్ గగన్ అతిథి గృహంలో ఆదివారంనాడు మోహిత్ గదిని బుక్ చేశాడు. ప్రియాంక తన భార్య అని అతను మేనేజర్‌కు చెప్పాడు. సాయంత్రం అతిథి గృహం నుంచి వెళ్లిపోతూ మోహిత్ శర్మ కనిపించాడు.
మర్నాడు అతిథి గృహం మేనేజర్ గదికి కాల్ చేస్తే జవాబు రాలేదు. దాంతో సిబ్బంది బలవంతంగా తలుపులు తెరిచారు. ప్రియాంక శవం గదిలో పడకపై వారి కంటపడింది. ప్రియాంక, మోహిత్‌లకు నిరుడు నిశ్చితార్థం జరిగింది. మోహిత్ మద్యానికి బానిస అని, ప్రవర్తన సరిగా ఉండదనే కారణాలతో ప్రియాంక కుటుంబం పెళ్లిని రద్దు చేసుకోవాలని అనుకుంది.
మోహిత్ శర్మ ప్రియాంకతో టచ్‌లో ఉన్నాడు. పెళ్లి రద్దు చేసుకుంటున్నారనే విషయం అతనికి మెల్లగా తెలిసింది. దీంతో ప్రియాంకను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications