విమానంలో పండండి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: ముంబైకి మళ్లింపు..
ముంబై: విమానంలో ఓ గర్భిణి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబుదాబి నుంచి జకార్తా వెళుతున్న ఎతిహద్ ఎయిర్‌వేస్ విమానంలో ఇండోనేషియాకు చెందిన ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తున్నారు.
మార్గమధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా జకార్తాకు చేరుకుందని ఎతిహద్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications