Woman: తాళిబోట్టే యమపాశమైంది.. గొంతుకు కోసుకుపోయి మహిళ మృతి..

ఓ మహిళకు తాళిబోట్టే యమపాశమైంది. తాళి గొంతుకు కోసుకుపోయి మరణించింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. మధుబనికి చెందిన అనిల్‌ పాశ్వాన్‌, భార్యా రాధాదేవి కొడుకుతో పాటు గాంధీనగర్‌కు వలస వెళ్లాడు. రఘుబీర్‌పురలో టైలర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గత శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాధాదేవి దటి అంతస్తులోని బాల్కనీలో రాధాదేవి తన కుమార్తెను ఒడిలో పెట్టుకుని నడుచుకుంటూ వస్తోంది. ఆ సమయంలో, ఆమె బ్యాలెన్స్ కోల్పోవడంతో తన కుమార్తెతో పాటు కింద పడిపోయింది.

ఈ క్రమంలో ఆమె తాళిబొట్టు మెడకు చుట్టుకుని కోసుకుపోయింది. ఆ గాయాలతోనే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుమార్తెకు ఎలాంటి గాయాలు కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మెడ చుట్టూ గాయాలు కనిపించడంతే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చిన్నారి చెప్పిన ప్రకారం తాళి కోసుకుపోవడం వల్లే రాధాదేవి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఘటన జరిగినప్పుడు ఆమె భర్త దుకాణంలో ఉండడాన్ని గుర్తించిన పోలీసులు దీన్ని ప్రమాదంగా తేల్చారు.

Woman dies after falling from balcony with two year-old daughter, baby safe

అటు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా గొంతుతో పాటు ఇతర చోట్ల గాయాలు కావడం వల్ల మృతి చెందినట్లు తేలింది. రాధాదేవికికు బలమైన గాయం కావడం వల్ల మృతి చెందినట్లు గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో అరుణ్‌శర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+