రెండు సార్లు పారిపోయి ఒకే వ్యక్తిని పెళ్లాడింది: ఆ తర్వాత... వదిలేసింది
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే వ్యక్తిని రెండు సార్లు వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. సోహిని పటేల్ అనే మహిళ వినోద్ పటేల్‌ను మూడు నెలల్లో రెండుసార్లు వివాహం చేసుకుంది. తాను అతనితో కలిసి ఉండనని గుజరాత్ హైకోర్టుకు ఆ మహిళ తెలిపింది.
అంతేగాక తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అతనిపై ఫిర్యాదు చేసింది. కాగా, ఆ మహిళ రెండుసార్లు అతనితో పారిపోయి వివాహం చేసుకోవడం గమనార్హం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలు కూడా చేశారు.
18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వినోద్‌తో తొలిసారి నిరుడు ఆగస్టులో సోహిని పారిపోయింది. ఆగస్టు 23, 2013లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఇరు కుటుంబాలకు దొరికిపోయారు. కుటుంబసభ్యుల ఒత్తిడితో ఆగస్టు 26, 2013లో విడాకుల పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం మూడు నెలల తర్వాత (ఆగస్టు 26, 2013) మరోసారి ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. రాజ్‌కోట్ వెళ్లిన ఈ ప్రేమ జంట అక్కడే రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. జునాగఢ్‌కు వెళ్లి అక్కడే 11నెలలపాటు కాపురం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 16న అహ్మదాబాద్‌లోని తన ఇంటికి వచ్చింది సోహిని. తన భర్త ఒత్తిడి వల్లే అతనితో వెళ్లిపోయానని చెప్పింది.
కాగా, సోహిని వెళ్లిపోవడంతో వినోద్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశాడు. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని ఆమె తండ్రి, సోదరుడిపై ఫిర్యాదు చేశాడు. తమను బలవంతంగా వేరు చేశారని ఆరోపించాడు. తన భార్యకు తనతో ఉండాలని ఉన్నా.. ఆమె కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు ఆమె వారివద్దకు వెళ్లిపోయిందని పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉండగా తనకు తన భర్తతో కలిసి ఉండాలని లేదని సోహిని కోర్టుకు తెలిపింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొంది. అతనికి అప్పటికే వివాహం జరిగిందని.. తనను వివాహం చేసుకునేందుకే అతడు ఆ విషయం దాచిపెట్టాడని తెలిపింది. ఆమెను హింసకు గురిచేసిన కేసులో జునాగఢ్‌లో అతనిపై క్రిమనల్ కేసులున్నాయని పేర్కొంది.
విచారించిన కోర్టు సోహినిని తన కుటుంబసభ్యులతో ఉండేందుకు అనుమతించింది. అదే సమయంలో తన భార్యను తన వద్దకు న్యాయపరంగా తీసుకువచ్చుకునేందుకు అనుమతిచ్చింది.












Click it and Unblock the Notifications