ఆమెపై నుంచి 56 బోగీల రైలు వెళ్లింది

పురులియా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ మహిళ పైనుంచి 56 బోగీల గూడ్స్ రైలు వెళ్లింది. అయినా ఆమె బతికే ఉంది. ఆ మహిళ రైల్వే ట్రాక్‌ దాటుతుండగా పొరపాటున ఆమె స్వెటర్‌ ట్రాక్‌లో ఇరుక్కిపోయింది.

దాన్ని లాక్కునేలోపే గూడ్స్‌ రైలు వచ్చేసింది. అక్కడున్న ప్రజలకు ఏమీ తోచలేదు. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా ట్రాక్‌ మధ్యలో పడుకుంది. 60 బోగీలు గూడ్స్‌ రైలు వెళ్లిపోయినంత వరకు ఆమె పడుకునే ఉంది.

Woman escapes almost unhurt after 56 railway wagons pass over her

గూడ్స్‌ వెళ్లిన తర్వాత ఆమె నింపాదిగా పైకి లేచింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, ఆమెను ట్రాక్‌ నుంచి పైకి లేపారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో జరిగింది. ఆ మహిళా ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుంది.

ఆమెను స్థానిక పురూలియా సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఆమెను ఇంటికి పంపించారు. పురూలియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆమె జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నుంచి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+