పాము కనికరించింది: అయినా భర్తను చంపించిన భార్య
కోయంబత్తూరు: కట్టుకున్న భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య అతనిని హత్య చేయించింది. గత రెండు నెలల నుంచి ఎన్నో విధాలు గా ప్రయత్నించి చివరికి సుఫారీ ఇచ్చి భర్త ను దారుణంగా హత్య చేయించింది.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని పట్టనందూర్ లో ఈ దారుణం జరిగింది. శక్తివేల్ (36), శశి (32) దంపతులు. వీరు పట్టనందూర్ లో నివాసం ఉంటున్నారు. కృష్ణ అనే వ్యక్తితో శశి అక్రమ సంబంధం పెట్టుకుంది.

తన ప్రియుడితో సుఖంగా ఉండాలంటే తన భర్త శక్తివేల్ ను చంపేయాలని శశి ప్లాన్ వేసింది. రెండు నెలల క్రితం పెద్ద నాగు పామును తెప్పించింది. బెడ్ రూంలో భర్త నిద్రపోతున్న విషయం గుర్తించింది. పామును బెడ్ రూంలోకి వదిలింది.
అయితే రెండు గంటల పాటు బెడ్ రూంలో ఉన్న పాము శక్తివేల్ ను కాటు వెయ్యకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. అప్పటి నుంచి ఆమె ప్రియుడు కృష్ణతో కలిసి భర్తను చంపడానికి వివిధ రకాలుగా ప్రయత్నించింది.
చివరికి సుందరమ్ అలియాస్ రామ్ (30) అనే వ్యక్తిని కలిసి తన భర్తను చంపేయాలని సుఫారీ ఇస్తానని చెప్పింది. అడ్వాన్స్ గా రూ. 15,000 ఇచ్చింది. తన భర్తను హత్య చేసిన తరువాత రూ. ఐదు లక్షల వ్యయంతో జిమ్ సెంటర్ పెట్టిస్తానని మాట ఇచ్చింది.
శశి దగ్గర డబ్బులు తీసుకున్న సుందరమ్ అలియాస్ రామ్ పెద్ద పెద్ద కర్రలు తీసుకుని శశి, కృష్ణలతో కలిసి శక్తివేల్ ను దారుణంగా హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చెయ్యగా అసలు విషయం తెలుసుకుని శశి, ఆమె ప్రియుడు కృష్ణ, కిరాయి హంతకుడు సుందరమ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications