అమెరికా వీసా కోసం పెళ్లి నాటకమాడిన యువతి: దొరికిపోయిందిలా!

Subscribe to Oneindia Telugu

ముంబై: అమెరికా వీసా కోసం ఓ యువతి పెళ్లి నాటకమాడి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కిరణ్ పార్మార్ అనే యువతి తనకు కాబోయే భర్తను కలుసుకునేందుకు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో వీసా కోసం అమెరికన్ కాన్సులేట్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, కిరణ్ తాను నికోలస్ జూడ్ అనే వ్యక్తిని పెళ్లాడినట్లుగా బూటకపు పేపర్లను సృష్టించింది. అంతేగాక, జూడ్ అనే ఆ వ్యక్తికి రూ.1.5లక్షలు చెల్లించి తన భర్తంటూ కిరణ్ అతడ్ని తీసుకుని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లింది.

Woman fakes marriage with seaman for US visa, held

కాగా, భర్త నటించేందుకు వచ్చిన జూడ్.. పలుమార్లు అమెరికాకు ప్రయాణించినట్లు అతని పాస్ పోర్టులో ఉండటంతో అమెరికన్ కాన్సులేట్ అధికారులు ఈ విషయమై యువతి కిరణ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేకపోయింది.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తప్పుడు పెళ్లి పత్రాలు సమర్పించి మోసం చేశారనే అభియోగాలతోపాటు కిరణ్ తోపాటు జూడ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman's plan to ace a visa interview at the US consulate by posing as a married couple with a well travelled merchant navy seaman backfired when she failed to explain why her 'husband' had several US visa stamps in his passport, but she had none. Both have been arrested for cheating, forgery and criminal conspiracy.
Please Wait while comments are loading...