దుబాయ్-కొచ్చికి వచ్చిన విమానంలో స్పృహ కోల్పోయిన మహిళ, మృతి
కొచ్చి: శనివారం దుబాయ్ నుంచి విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కొచ్చిలో విమానం ల్యాండైన తర్వాత .. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినీ(56) అనే మహిళ దుబాయ్ నుంచి కొచ్చికి విమానంలో వెళ్తుండగా స్పృహ కోల్పోయి పడిపోయింది. "ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు అని అధికారులు తెలిపారు.

ఆమె ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతోందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మరణం సహజ కారణాల వల్ల సంభవించినందున, పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications