Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెట్రోలో ఆ పని చేసిన మహిళ.. వీడియో వైరల్.. అధికారులు సీరియస్

బెంగళూరు మెట్రోలో ఓ మహిళ చేసిన పనికి అధికారులు సీరియస్ అయ్యారు. ఆమెకు రూ. 500 ఫైన్ కూడా విధించారు. అవును.. బెంగళూరు మెట్రోలో ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్ తింటూ కెమెరాకు చిక్కింది. దీంతో మెట్రో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు రూ. 500 జరిమానా విధించారు అధికారులు. మెట్రో ట్రెయిన్స్ లో ఆహారం తినడం నిషేధమని ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపిన ప్రకారం ఈ ఘటన ఏప్రిల్ 26న జరిగింది. మెట్రో రైలు ఎక్కిన ఓ మహిళ మదవర మెట్రో స్టేషన్ నుంచి మగది రోడ్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించింది. ఆ మహిళ మెట్రోలో లంచ్ బాక్స్ తిన్నది. అయితే రన్నింగ్ లో ఉన్న మెట్రోలో లంచ్ బాక్స్ తినడం చట్టరిత్యా నేరం అని అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ. 500 జరిమానా విధించారు.

Woman Fined Rs 500 for Eating Lunch in Bengaluru Metro

కదులుతున్న మెట్రోలో ఆమె లంచ్ చేయడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ మెట్రో రైలులో తినడం లేదా తాగడం నిషిద్ధం. ఇవి మెట్రో రూల్స్ కు విరుద్ధం. రైలులో పరిశుభ్రత కోసమే ఈ నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల మెట్రో స్టేషన్లలో పొగాకు వినియోగం, రవాణా నిషిద్ధం అని మెట్రో సంస్థ ప్రకటించింది. మెట్రో రైలులో, మెట్రో స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇటీవల మెట్రో రైలులో ఓ వ్యక్తి గుట్కా నములుతూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొత్త రూల్స్ తీసుకొచ్చింది మెట్రో సంస్థ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+