పెళ్లయిన టాక్సీ డ్రైవర్‌తో సహజీవనం: నేపాలీ మహిళపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: పెళ్లయిన ఓ టాక్సీ డ్రైవర్‌తో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్న నేపాలీ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ద్వారకాలో ఈ సంఘటన సోమవారంనాడు చోటు చేసుకుంది. 22 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తులు ద్వారక చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు.
మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి తెలిసినవారే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దేవేంద్ర అనే ఆ టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నిందితుల పేర్లు తెలిశాయి.

మంగళవారంనాడు ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను కిశోర్ కుమార్ జైన్ (34), సౌరభఝ్ శర్మ (30)లుగా గుర్తించారు. వారిని మంగళవారంనాడు తీహార్ జైలుకు తరలించారు. వారిద్దరికి కూడా పెళ్లిళ్లు అయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. నిందితుల స్థావరాలపై దాడులు చేసి పోలీసులు వారిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications