Viral video: నోరూరించే భోజనం-నోట్లో ముద్ద పెట్టుకునేలోపే-వీడియోగ్రాఫర్ ఎంత పనిచేశాడు

ఈరోజుల్లో పెళ్లిళ్లు,శుభకార్యాలంటే వీడియోగ్రఫీ తప్పనిసరి. కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో ఫోటోషూట్స్,వీడియో షూట్స్‌తో ఆ హంగామానే వేరుగా ఉంటుంది. అయితే స్టిల్స్ విషయంలో.. కవరేజీ విషయంలో కొన్నిసార్లు వీడియోగ్రాఫర్లు చేసే అతి కోపం తెప్పిస్తుంటుంది. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ఆ వీడియోను గమనిస్తే... ఏదో ఫంక్షన్‌లో ఒక యువతి ప్లేటు నిండా నోరూరించే వంటకాలన్నీ వడ్డించుకుని భోజనం చేస్తోంది. అన్నీ కలిపి నోట్లో ముద్ద పెట్టుకునే సమయంలో... సరిగ్గా ముఖం మీదే వీడియో పెట్టేశాడు కెమెరామెన్. దీంతో విచిత్రమైన హావభావాలు ప్రదర్శించిన ఆ యువతి... చేత్తో తినడం ఆపేసి... స్పూన్‌తో తినడం మొదలుపెట్టింది. వీడియో వైపు చూస్తూ నిట్టూర్చినట్లుగా ఓ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

woman funny expressions after videographer focused the video on her food plate

సోషల్ మీడియాలో ఇటువంటి వైరల్ వీడియోలు బోలెడు. ఎప్పుడూ ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటోంది. పెళ్లికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా ఆటపట్టించాలనుకుందో లేక అత్యుత్సాహమో తెలియదు గానీ ఓ పెళ్లిలో వధువు సోదరి... ఉన్నట్టుండి ఒక్కసారిగా వరుడి చెంపపై ముద్దు పెట్టేసింది. అంతేనా... గాఢమైన తన ముద్దు నుంచి వరుడు తప్పించుకోకుండా... రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గట్టిగా అదిమిపట్టింది. ఆమె ముద్దు ధాటికి ఆ వరుడు కొద్ది క్షణాలు విలవిల్లాడిపోయాడు. ఆ యువతి చేసిన పనికి స్టేజీ మీద ఉన్నవాళ్లంతా గొల్లున నవ్వారు. బావను మరదళ్లు సరదాగా ఆటపట్టించడం కామనే గానీ... మరీ ఇలానా అని ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+