అమేథీలో మహిళపై గ్యాంగ్ రేప్: నలుగురి అరెస్టు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతును్నాయి. తాజాగా, కాంగ్రెసు కంచుకోట అయిన అమేథీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అమేథీ లోకసభ స్థానానికి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై జరుగుతన్న అత్యాచారాలపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీవ్ర విమర్సలకు గురవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

ఇటీవల బదౌన్ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిపి, వారిని హత్య చేసి వారి శవాలను చెట్టుకు వేలాడదీసిన సంఘటన ఐక్య రాజ్య సమితి దాకా వెళ్లింది. ఓ మహిళా న్యాయమూర్తిపై కూడా ఆ తర్వాత అత్యాచారం జరిగింది. నిందితులు ఆమె చేత బలవంతంగా పురుగుల మందు తాగించారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తదితరులు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications